AMMA KATHA by CHITI PROLU VENKATA RATNAM Telugu book cover

AMMA KATHA

by CHITI PROLU VENKATA RATNAM

₹680
In stock · 44 available
PublisherCHITI PROLU VENKATA RATNAM
LanguageTelugu
ఏదైనా అనువాదరచన చదివే టప్పుడు అది స్వతంత్రరచనలాగనే భాసిల్లడం ఉత్తమానువాదానికి గీటురాయి. వేంకటరత్నం గారి గేయానువాదంలో ఉన్న ధారాళత, సహజత దీన్ని అనువాదం అన్న స్ఫురణ కలగ నివ్వవు. పైగా వచన జీవితచరిత్రకు కవిత్వసౌరభం అద్దినట్లుంది. అనువాదం మూల విధేయంగా సాగడంతో ప్రామాణికతకు ఎక్కడా భంగం కలగలేదు. రచనలో అత్యంత క్లిష్టమైన క్రైస్తవ సంబంధ మైన సాంకేతిక పదజాలాన్ని తమ భాషా పటిమతో చాలా సమర్థంగా అనువదించారు. అన్నింటికీ మించి ఒక ఆదర్శసేవామూర్తి జీవితచరిత్ర అనువాదం 'అమ్మకథ' ను మరొక ఉత్తమ సేవాతపస్విని డాక్టర్ సిస్టర్మేరీగౌరీగారికి అంకితమివ్వడం మిత్రులు వేంకటరత్నం గారి సముచిత మైన నిర్ణయం. -డా. వెన్నా వల్లభరావు ('కేంద్రసాహిత్యఅకాడమీ' ఆనువాద పురస్కారగ్రహీత)