AMMA NANNA PILLALU (GAMANISTUNNAMA) by RAMAKRISHNA PRASAD Telugu book cover

AMMA NANNA PILLALU (GAMANISTUNNAMA)

by RAMAKRISHNA PRASAD

₹100
In stock · 9 available
PublisherRAMAKRISHNA PRASAD
LanguageTelugu
అమ్మ - నాన్న, పిల్లలు (గమనిస్తున్నామా?) ముందుమాట అమ్మ-నాన్న, పిల్లలు కలిస్తే ఒక కుటుంబం, అనేక కుటుంబాలు కలిస్తే సమాజం ఏర్పడతాయి. కుటుంబంలోని సభ్యుల మధ్య ప్రేమాభి మానాలతో, సదవగాహనతో కూడిన సత్సంబంధాలు ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్లు భావించవచ్చు. అలా అన్ని కుటుంబాలూ ఉంటే సమాజమంతా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో వాస్తవ పరిస్థితి అంత ఆరోగ్యకరంగా లేదు. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య అవగాహన కనీస స్థాయిలో కూడా లేదనే చెప్పాలి. ఎవరి ప్రయోజనాలు వారివి. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తోటివారి ప్రేమను బలవంతంగా పొందాలని ఆశిస్తూ, కుటుంబ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, యుద్ధరంగంలా మారుస్తున్నారు. ఈ యుద్ధరంగంలో ఎక్కువగా గాయపడేది వృద్ధులైన అమ్మ-నాన్నలే. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వారికి జరిగే నష్టమే ఎక్కువ. వారికి యుద్ధం చేసే ఓపిక లేక వృద్ధాశ్రమాలలో చేరుతున్నారు. అందుకు తగిన ఆర్థిక వనరులు లేకపోతే వీధుల పాలవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వృద్ధాప్య దశలో అమ్మానాన్నలను చూడవలసిన బాధ్యత 'పిల్లలదే' అనే విషయంలో సందేహం లేదు. అయితే ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుందా? అనేది ఒక ప్రశ్న. సాంప్రదాయకంగా మన సమాజం అమ్మానాన్నల బాధ్యతను, ఇంటి పేరుకి వారసులైన మగపిల్లల మీదనే ఉంచింది. అమ్మానాన్నల