
AMMA PAATA
₹60
In stock · 50 available
PublisherRAJA VASIREDDY MALLEESWARI
LanguageTelugu
అమ్మ మాట అమ్మగా ప్రతి అమ్మ గుండె కదిలే అనుభూతుల భావాల దర్పణంగా అమ్మపాటను వినిపించగలిగానంటే నేను అమ్మనేగా. నా బిడ్డలు పసివారుగా ఉన్నపుడు వారి ప్రతి కదలికా నన్నెంతో మురిపించేది. ఆ మురిపెమే అమ్మపాటై మీ ముందుకొచ్చింది. తన చిన్న పాపల చూచి పొందే ఆనందం కొందరు అమ్మల్లో మాటలైతే కొందరు అమ్మల్లో పాటలౌతూ ఇలా “అమ్మపాటలా” అమ్మ పాటను గల అభివ్యక్తి అంతా ప్రతి అమ్మదీ అవుతుంది. నా మనోభావాలు “అమ్మపాట”గా పుస్తక రూపమై మీ ముందుకు రావటానికి కారణం – మంచి ప్రయత్నానికి సహకారముంటుందని ఋజువు చేస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారందించిన ఆర్థిక సహకారం నా ఆనందాన్ని ఆకాశపుటంచుల దాకా తీసుకెళ్ళిన వారికి సదా నా కృతజ్ఞతలు. అంటూ నాకు తన అమ్మపాట చదివి - ఈ మధ్యకాలంలో ఇటువంటి పుస్తకం రాలేదు. మంచి ప్రయత్నం చేశావు. భావాలు బాగున్నాయి ఆత్మీయతను, ఆశీస్సులను అందించిన అమ్మ శ్రీమతి ముక్తేవి భారతి గారికి, సుదీర్ఘ స్నేహానుభవాన నా మనసు తెలిసి ఎంత బాగా రాశావు. అమ్మ అంటూ మెచ్చిన నెచ్చెలి శ్రీమతి పాటనెంత అద్భుతంగా పాడావు యార్లగడ్డ శైలజకు నా కృతజ్ఞతలు. ఈ అమ్మపాట ముద్రణకు ఆర్థిక సహకారమందించిన నా చిరకాల మిత్రురాలు శ్రీమతి రుక్మిణీ రమణగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అమ్మపాటను సుందరతరంగా సింగారించిన శ్రీమతి దామరాజు నాగలక్ష్మిగారికి కృతజ్ఞతలు. అమ్మపాట విని తమ స్పందనను ప్రశంసలుగా అందించిన మిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ అమ్మపాట పాఠకలోకాన్ని ఆనందింపచేయగలదని నా నమ్మకం. గాయకులకు ఉపయుక్తము కాగలదు. అమ్మలందరికి ఆనందప్రదమే. రాజావాసిరెడ్డి మల్లీశ్వరి