AMMANTE NEELAKAASAM by NARAMSETTI UMAMAHESWARA RAO Telugu book cover

AMMANTE NEELAKAASAM

by NARAMSETTI UMAMAHESWARA RAO

₹100
In stock · 491 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Ammante Neelakaasam Kathasamputi - Naaramsetty Umamaheswara Rao 'నారంశెట్టి' అనే మాటకు 'స్వచ్ఛమైన జ లం' అని అర్థాన్నివ్వచ్చు శబ్దవేత్తలెవరైనా. శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు సాహిత్యం కూడా అటువంటిదే. ప్రవాహగతిలో సాగే కథలే ఇవన్నీ. కథలు చెప్పడంలో గొప్ప నేర్పు, తీర్పు కనబడతాయి. ఊహించని మలుపులతో ముగుస్తాయి. ఏ అంశాన్ని తీసుకున్నా సున్నితంగా చెప్పడం ఆయనకు అలవాటు. సులభశైలి, సుతిమెత్తని వాక్యాలు, సునిశిత చమత్కారం, అదుపులో ఉండే అంతర్లీనాగ్రహం, వాటన్నిటితో పాటు రచయితకు ఉండవలసిన సామాజిక బాధ్యత ప్రతి కథలోనూ ద్యోతకమవుతాయి. ఆయన కథల్లో పరిమళించే మానవత్వం ఒక సాహితీ గుబాళింపు. ఆయన ఆలోచనల నుంచి ఉబికివచ్చే అక్షరాలు పాఠకుడితో పాటు పరుగిడతాయి. చక్కని సాహిత్యం సమాజ నిర్మాణానికి పనికి వస్తుందనే విషయం నారంశెట్టి కథలు చదివాక పఠిత మనసును పట్టి కుదుపుతుంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004