AMPASAYYA - NAVEEN - 325.00 by AMPASAYYA NAVEEN Telugu book cover

AMPASAYYA - NAVEEN - 325.00

by AMPASAYYA NAVEEN

₹325
In stock · 10 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
అంపశయ్య తెలుగు నవలా సాహిత్యంలోకి ఒక అక్షరక్షిపణిలా ప్రవేశించి యిప్పటికే మూడునాల్లు తరాలను ప్రభావితం చేసిన నవల "అంపశయ్య”. నూతన సహసస్రాబ్దిలోకి ప్రవేశించ బోతున్న చారిత్రాత్మక సందర్భంలో వెయ్యేళ్ల మన తెలుగు సాహిత్యంలో వెలువడిన వేలాది గ్రంథాల్లో నుండి వంద 'ఆణిముత్యాలను' గుర్తించి సాహిత్య ప్రియులకు తెలియచేయాలని నిష్ణాతులైన అబ్బూరి ఛాయాదేవి, రావూరి భరద్వాజ, నండూరి రామమోహనరావు, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, సింగమనేని నారాయణ. వేగుంట మోహనప్రసాద్, ఎల్లూరి శివారెడ్డి, చేకూరి రామారావు వంటి ఉద్దండులు నలభై నాల్గు మందితో ఒక బృందాన్ని ఏర్పర్చి 'ఆంధ్రజ్యోతి' ఒక బృహత్తర ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టింది. వాళ్లు చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించి ఆంధ్ర మహాభారతం (కవిత్రయం), కన్యాశుల్కం, మహాప్రస్థానం, చివరకు మిగిలేది, అమృతం కురిసిన రాత్రి, మైదానం వంటి, వంద గ్రంథాలను తెలుగుజాతి గర్వించదగ్గ ప్రతిష్టాత్మక సాహిత్య సంపదగా ప్రకటించారు. వాటిలో మన నవీన్ రాసిన 'అంపశయ్య' నవల వరుస క్రమంలో నలభై తొమ్మిదవ ఆణిముత్యంగా, ఉత్తమ గ్రంథంగా గుర్తించబడి మనందరం గర్వించదగ్గ సుస్థిరమైన స్థానాన్ని పదిలపర్చుకుంది. అ రకంగా.. గెలిచి నిలిచి లక్షలాదిమంది పాఠకులను ఉర్రూతలూగించిన 'అంపశయ్య' నవల యిప్పుడు పదమూడవ ముద్రణగా వెలువడ్డున్న సందర్భంగా... ఒక సహ రచయితగా గర్విస్తూనే... నవీన్ గారిని అభినందిస్తున్నాను. రామా చంద్రమౌళి