
AMUSHMIKA SOPANALU
₹500
In stock · 69 available
PublisherSRI VEMURI SEETARAMAIAH
LanguageTelugu
శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః శ్రీ సద్గురుభ్యోనమః అనుభవ వేదాంత సూక్తులు తనయందు శ్రేష్ఠత్వము, ఎదుట లోపములు చూచుట లోక సహజము. సర్వము ఈశ్వరమయమగుటచే ఈశ్వర రూపముగాను, తనను దాసునిగాను గుర్తించుట ముముక్షు ధర్మము. తన యింద్రియాంతఃకరణలు యెదుటివారియందు లోపములను చూపి నప్పుడు, ఆయా వ్యక్తులు దోషవంతులని నిర్ణయించుట అజ్ఞాన దృష్టి. అట్టి దోషములు తనయందు కలవేమో పరిశీలించుకొని వానిని తొలగించుకొనుటకు ఆ దృశ్యమును ఉపయోగపరచుకొనుట ముముక్షు దృష్టి. ప్రపంచమంతయు మనకీశ్వరతత్వమును ఈశ్వర విలాసమును బోధించుట కేర్పడిన ప్రత్యక్ష వేదముగా గుర్తించవలెను. వేద పురుషుడు మన అంతఃకరణ యందలి లోపాలోపములను ఎత్తి చూపి బోధించుటకే ఈశ్వరుడుగా గోచరించక జగత్తుగా గోచరించుచున్నాడు. అందు ప్రతి వస్తువునందును కొన్ని శ్రేష్ఠమగు లక్షణములు, కొన్ని లోపములు కూడా తోచకపోవు. అందుగల శ్రేష్ఠత్వము ఈశ్వర విభూతిగా గుర్తించి, యీశ్వరుడుగానే తెలియవలెను. దోషములు తోచినపుడెల్ల అట్టి దోషములు తన యందు కలవేమో పరిశీలించుకొని తొలగించుకొనుటకు ప్రయత్నింప వలెను. తనయందట్టి దోషములేదని, తాను కృఢముగా నమ్మినను, తన అంతఃకరణ యింకను యెదుట గోచరించు పరమాత్మను గుర్తించక దోషములనే గుర్తించగల శక్తి లోనున్నట్లు తనకు తెలుపుటకే పరమాత్మ అట్లు గోచరించెనని నిశ్చయించవలెను. ఇంద్రియాది అంతఃకరణలు త్రిగుణాత్మకములగుటచే నిరంతరము దోషముతో కూడినవేగాని దోషరహితమెన్నడును కాదు. వాటిని ప్రమాణముగా తీసుకొనుటకంటె పొరపాటు లేదు. అనుభవ వేదాంతసూక్తులు