ANAGANAGA O NENU - JEEVITHAM JAGRUTHILO by NARRA RAMAKRISHNA CHOWDARY Telugu book cover

ANAGANAGA O NENU - JEEVITHAM JAGRUTHILO

by NARRA RAMAKRISHNA CHOWDARY

₹250
In stock · 70 available
PublisherNARRA RAMAKRISHNA CHOWDARY
LanguageTelugu
ISBN9789356023536
ముందుమాట ప్రియమైన నా ఆత్మీయ పాఠకులరా! ఎన్నో సంవత్సరాల నుండి నా అంతరంగంలో సాగిన ఈ పుస్తక రచన, ఈరోజు మీ చేతికి చేరి, మీ ముందుకు వచ్చింది. ఈ గ్రంథం ఒక కథ కాదు, ఒక నవల అంతకంటే కాదు. ఇది మనందరి అంతరంగంలో నిరంతరం జరిగే ఒక ఆత్మ కథనం. ఇది మీలో ఉన్న 'నేను' గురించి, ఆ 'నేను' అనుభవించే జీవితం గురించి, మరియు ఆ జీవితాన్ని జాగృతిలో ఎలా జీవించాలి అనే దాని గురించి రాసిన ఒక మార్గదర్శకం. సాధారణంగా, ఒక రచయిత ఏదైనా గొప్ప కథను చూసినప్పుడు లేదా ఏదైనా ఒక సంఘటనతో ప్రభావితమైనపుడు పుస్తకం రాస్తారు. కానీ ఈ పుస్తకానికి నా ప్రేరణ బయట ప్రపంచం కాదు. లోపలి నుండి వచ్చిన ఒక నిశ్శబ్ద పిలుపు. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించినప్పుడు, నేను ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని చూశాను. అందరూ వేగంగా పరుగెడుతున్నారు. కానీ ఎక్కడికి చేరుకోవాలో మాత్రం తెలీదు. డబ్బుంది, సౌకర్యాలు ఉన్నాయి. ప్రశాంతత లేదు. నవ్వు ఉంది, కానీ ఆనందం లేదు. సంబంధాలు ఉన్నాయి, ప్రేమ లేదు. నేను కూడా ఈ పరుగులో భాగంగా ఉండేవాడిని. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక పెద్ద ప్రశ్న నా మనసును తొలిచేది. ఈ పరుగు ఎందుకు? నా నిజమైన 'నేను' ఎక్కడ దాగి ఉన్నాడు? ఆ ప్రశ్న నుండే ఈ ప్రయాణం మొదలైంది. నేను మొదట నా అంతరంగంలోకి ప్రయాణించడం నేర్చుకున్నాను. ఈ ఆత్మాన్వేషణ ప్రయాణమే ఈ పుస్తకానికి ప్రాణం పోసింది. చాలామంది పుస్తకం రాయడం అంటే కూర్చుని అక్షరాలు పేర్చడం అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక రచన, అందునా ఆచరణాత్మక తత్వాన్ని రాయడం అంత సులభం కాదు. ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు నేను పడ్డ శ్రమ రెండు రకాలు. అంతరంగ శ్రమ : ఈ పుస్తకంలోని ప్రతి పేజీ, నేను నా జీవితంలో సంఘర్షణే గురువుగా నేర్చుకున్న పాఠాల సారం.