
ANAGANAGA YADARTHA GATHALU
₹50
In stock · 651 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తల్లి ప్రాణం మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం జరిగిన సంఘటన ఇది. ఒక తూరి గ్రేట్ బ్రిటన్లోని సౌత్ వేల్స్ కొండల ప్రాంతములో మంచుతోకూడిన భీకర తుఫాన్ ఏర్పడింది. ఆ సమయంలో బ్రిటన్ రాజవంశానికి చెందిన ఒక స్త్రీ పసిబిడ్డతో ఆ కొండల నడుమ దారిలో పయనిస్తూవుండి ఆ తుఫానులో చిక్కుకొని మరణించింది. తుఫాను శాంతించాక ఆ రాజవంశం స్త్రీ శవం కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. వారికి మంచుగుట్టల క్రింద మరికొన్ని శవాలతోబాటు రాజవంశపు స్త్రీ శవం కూడా దొరికింది. విచిత్రంగా ఆ రాజవంశపు స్త్రీ వంటిమీద ఒక్క నూలుపోగూ లేకుండ నగ్నశవంగా ఒక మంచుగుట్టక్రింద అన్వేషకుల కంటపడింది. మంచు కుప్పను పూర్తిగా తొలిగించి ఆ శవాన్ని బయటికి లాగిచూస్తే, వారికి ఆ శవం ఒంటిపైని దుస్తులన్నీ ఏమయ్యాయో అప్పుడు అర్థమయింది. తను ఆఖరి శ్వాస వదిలే ముందు ఆ మాతృమూర్తిలోని తల్లిప్రేమ పనిచేసింది. ఈ మంచు తుఫానులో తన చావు నిశ్చయమని అర్ధం చేసుకొన్న ఆమె, తన ఒంటిమీదున్న దుస్తులన్నింటినీ ఊడదీసి తన చంకలోని నెలల పసిబిడ్డకు చుట్టి, ఆ బిడ్డను తన ఒడిలో పొదవి పట్టుకొని తను లుంగచుట్టుకొని మంచులో ముడుచుకుని అట్లే ఆఖరి శ్వాస విడిచింది. ఆ పసిబిడ్డ తన తల్లి వెచ్చని ఒడిలో ఆ ప్రాణాంతక మంచు తుఫాను నుంచి బ్రతికి బయటపడింది. తల్లిప్రాణం తను పోసుకొన్న ఆ నెలల బిడ్డడు మరెవరో కాదు, తరువాతి కాలంలో ఇంగ్లండుకు ప్రధాని అయిన (1916-21) డేవిడ్ లాయ్డ్ జార్జి.