ANDAME ANANDAM - GUNDU CARTOON by DR.RAMESH SRIRANGAM Telugu book cover

ANDAME ANANDAM - GUNDU CARTOON

by DR.RAMESH SRIRANGAM

₹600
In stock · 36 available
PublisherDR.RAMESH SRIRANGAM
LanguageTelugu
1. కాంతులీనే ముఖం సౌందర్యానికి సంకేతం పురాణాల కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ మగువల మనోహర రూపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాల భామల కోసం రాజుల మధ్య యుద్ధాలు జరిగాయి. రాజ్యాలను కోల్పోయిన వారూ ఉన్నారు. చరిత్రను పక్కన పెట్టి, వర్తమానంలోకి వస్తే ఆడ, మగ అనే తేడా లేకుండా అందరిలోనూ అందం కోసం ఆరాటం పెరిగింది. అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిల్లోనూ అందంపట్ల ఆసక్తి పెరిగింది. పుస్తకాలతో కంటే అద్దం ముందే నేటి యూత్ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారంటే అందులో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా మ్యారేజ్ బ్యూరోకెళితే వాళ్లు ఫొటో చూసి చెప్పేస్తారు. పెళ్లి తొందరగా అవుతుందా? లేక ఆలస్యం అవుతుందా?” అని. ఓ తెలుగు మ్యారేజ్ సైట్లో మూడు నెలలకి డబ్బు కడితే, అమ్మాయి ఫొటో పెట్టిన వారంలోనే పెళ్లి కుదిరిపోయిన సంఘటనలున్నాయి. నేటి సమాజంలో అందానికి వున్న ప్రాముఖ్యం అటువంటిది. ఏం చేస్తే ఒక వ్యక్తి అందంగా వుంటాడు?" అని పరిశీలన చేసుకుంటే - అపుడు ముఖానికే పెద్దపీట వేయాల్సి వస్తుంది. శరీర అందంలో ముఖానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది.