
ANDANIVADU
₹200
In stock · 624 available
PublisherLANKA NAGENDRA RAO
LanguageTelugu
ఆత్మీయ ఆదరభావంతో విలువ కట్టలేని అక్షర సుగంధ పరిమళాలను 'అందనివాడు'కు అలంకారంగా పులిమిన ముగ్గురి ఉత్తమ వ్యక్తిత్వాల సంస్కారానికి అభివందనం. పెద్దాయన వాశిరాజు ప్రకాశంగారు. నన్నెప్పుడూ చూడకపోయినా కేవలం ఫోన్ ద్వారా 'మాట' సహాయాన్ని కోరినంతనే, మాటపూర్తికాక ముందే సంతోషంతో - ఉద్వేగంతో తన నిర్ణయాన్ని వ్యక్తపరచిన వారి సహృదయతకు ప్రణమిల్లుతూ, - నాడు వారు చేసిన ప్రయోజన కరమైన ప్రయోగం 'కాలం మారింది' చిత్రం. సమాజ మార్పునకు తానూ సమిధను సమర్పించిన అభ్యుదయవాది శ్రీ వాసిరాజు ప్రకాశంగారు. ఆయన అంతఃకరణ శుద్ధమైనది. అందువల్లనే ఆ చిత్రానికి విజయమూ సిద్ధించింది. సీనియర్ జర్నలిస్టుగా అందరికీ తెలిసిన ఆయన గురించి ఏం చెప్పగలం. ఆయన అక్షరాలు సమాజాన్ని పాలకులను ప్రశ్నిస్తాయి. ఆయన ప్రశ్నలకు నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీయే స్వయంగా సమాధానాలు చెప్పడం విశేషం. సాహిత్యంలో ఆయన వ్రాసిన ప్రతి పదమూ కదం తొక్కింది. సినిమా జర్నలిస్టుగాను ఆ కలం చైతన్య స్రవంతి. ఆ కలం కదులుతూనే ఉంటుంది. అది ఓ జీవధార. ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు ఇంకా ఇంకా నిరాటంకంగా కొనసాగాలని భగవంతుడు వారికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చదువుకునే వయస్సునుండే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్రి హృదయం దేశభక్తిపూరితం. ప్రత్యేక రాస్త్రోద్యమంతో మొదలై సంపూర్ణ స్వరాజ్యోద్యమంలో భాగమై అరెస్టులకు గురియైనా అచంచల ధైర్య సాహసాలతో కొనసాగినవారు. ఆరంభంతో వదిలేయక పరిపూర్ణంగా పనిని పూర్తి చేయగల సమర్థులు పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఓ సారి మద్రాసులోని క్వీన్ మేరీస్ కాలేజీలో విద్యార్థినుల తెలుగు విభాగం మూత పడినప్పుడు, మళ్ళీ తెరవరనే భయాందోళనలు నిండి నిరాశాజనకమైన పరిస్థితుల్లో అక్కడివారి అభ్యర్థనను ఆలకించి వెంటనే లోక్సభ స్పీకర్ బాలయోగి గారికి ఆ వివరాలనందించి అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధితో వారిని మాట్లాడించి ఇరవైనాలుగు గంటల్లో "తెలుగు విభాగాన్ని ఆపవద్దు. కొనసాగించాలి" అనే ఆర్డర్సును పంపించగలగడం ఆయన కార్యదక్షతకు చిత్తశుద్ధికి ఓ ఉదంతం. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంల నుండి ఆయన మాట ఒకే రోజు ఫోన్లో వినటం ఆశ్చర్యంకాదు. అందరి కోసమూ అలాగే ప్రభుత్వ వ్యవహారాల కోసమూ అతనిది నిత్య సంచారం. ఇంతటి ఊపిరి సలపని కార్యక్రమాల్లో ఉంటూ కూడా 'అందనివాడు'కు 'మాట' సహాయాన్ని అందించిన వారి నిర్మల హృదయానికి ప్రణామం. 65 గ్రంధాల రచనానుభవం కలిగిన ఆయన ఈ పుస్తకంలో భాగం కావడం నాకు గౌరవాన్ని, విలువనూ ఆపాదించడమే. వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్దిస్తూయున్నాను. "అందనివాడు" పుస్తకం చదివి ఆనందాన్ని అణచిపెట్టలేక సంబరపడిపోయి హృదయానికి హత్తుకుని అభినందించిన విద్యాసంపన్నులు - విశిష్ట రచయిత చౌదరినాయుడు మాస్టారుగారు. ఈ ముగ్గురికీ వినయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ