
ANDHRA PITHAMAHUDU MADAPATI HANUMANTHA RAO
₹30
In stock · 399 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మాడపాటి హనుమంతరావు నేపథ్యం తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రోద్యమాన్ని ఆరంభించి తెలంగాణీయుల చేతనేకాక యావదాంధ్రంచేతనే 'ఆంధ్ర పితామహ’ అనిపించుకున్న మాన్యులు మాడపాటి హనుమంతరావు. తెలుగుభాషకు తెలంగాణలో అంతగా ఆదరణలేని రోజుల్లో ఆంధ్రుల్లో 'తామంతా తెలుగువాళ్ళం' అనే స్పృహను కలిగించిన మహనీయుడు మాడపాటి. అంతేకాదు అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక పునరుజ్జీవనానికి ఎంతో కృషి చేశారు. గ్రంథాలయోద్యమం, సంఘ సంస్కరణం, సాంఘికో ద్యమం, సాహిత్య వికాసం, స్త్రీ విద్య, మహిళా ప్రగతి... ఇలా ఒకటా రెండా అనేక ఉద్యమాలను ఒక్క చేతిమీదుగా నడిపించిన అసామాన్యుడు. తన నడవడితో యువతను కర్తవ్యోన్ముఖుల్ని చేసిన మార్గదర్శకుడు మాడపాటి. మాడపాటి 1885 జనవరి 22న కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఆర్వేల నియోగి బ్రాహ్మణులు. ఆపస్తంభ సూత్రులు. కౌశికస గోత్రిజులు. మాడపాటి వారికి అయిదేళ్ళున్నప్పుడే తండ్రి మరణించారు. దాంతో తన అన్న తిరుమల రావుతో కలిసి మేన మామల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. వీరి పెద్ద మేనమామ - జమలా పురం వెంకటరావు - సూర్యాపేట తహసీలు కచేరీలో పేష్కారుగానూ, రెండో మేన మామ రామచంద్రరావు నల్లగొండలో పేష్కారుగానూ పనిచేసేవారు. మేనమామల సహకారంతోనే మాడపాటి వారు 1898లో ఉర్దూ, 1900లో ఇంగ్లీషు మిడిల్ పరీక్షల్లో ఉత్తీర్ణు లయ్యారు. పారసీ సైతం నేర్చుకొన్నారు. అయితే దురదృష్టవశాత్తూ రెండేళ్ళ వ్యవధిలో మేనమామ లిద్దరూ మరణించడంతో మాడపాటి చదువు భారం ఆయన అన్నగారిపై పడింది. దరిమిలా మాడపాటి