ANDHRA PRADESH INTEGRATED MEDICAL ATTENDENCE RULES by ANISETTI SAIKUMAR Telugu book cover

ANDHRA PRADESH INTEGRATED MEDICAL ATTENDENCE RULES

by ANISETTI SAIKUMAR

₹120
In stock · 7 available
PublisherSNEHA PUBLICATIONS
LanguageTelugu
వైద్య పరిచర్య నిబంధనలు ఆంధ్రప్రదేశ్ వైద్య పరిచర్య నిబంధనలు 1972 Rule 1. వీటి పేరు (షార్ట్ టైటిల్): ఈ నిబంధనలను 'ఆంధ్రప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్' 1972 గా పిలవాలి. Rule 2. ఇవి వర్తించేది :- (ఎ) ఈ నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికీ వర్తిస్తాయి. (బి) ఈ నిబంధనలు “సెక్రటరీ ఆఫ్ స్టేట్ సర్వీసెస్ (మెడికల్ అటెండెన్స్) రూల్స్ 1938 కింద అర్హులైన వారికి, ఆలిండియా సర్వీసెస్ (మెడికల్ అటెండెన్స్) రూల్స్1954 కింద అర్హులైన వారికి వర్తిస్తాయి. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ అధికారుల (ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో సమానస్థాయిగల)కు; అందుకు ఈ రూల్సు పొందిక లేకుండా ఉండే విషయాలు కాకుండా వర్తిస్తాయి. Rule 3. నిర్వచనం :- ఈ నిబంధనలోని విషయం సందర్భాలకు సంబంధించి భిన్నంగా (Repugnant) 3 . (1) "ప్రభుత్వ ఉద్యోగి" అంటే పార్ట్ టైం, హానరరీ వర్కర్స్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద పూర్తికాలపు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారు, రాష్ట్ర ప్రభుత్వం కింద పని చేస్తూ వైద్య ఖర్చులపై ఇచ్చి పుచ్చుకునే పద్దతి ఏర్పాట్లున్నవారు, (2) "వైద్యశాల (Hospital)" అంటే ప్రభుత్వ వైద్యశాలలతో బాటు, రాష్ట్రంలోని ఏదేని ప్రత్యేక వైద్యశాల, లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వైద్య సంస్థ. నోట్ : ఎన్జీవోలు; నెలకు రూ.300/- మించకుండా జీతం పొందే స్థానిక సంస్థల, గ్రేటర్ హైదరాబాద్ (పాదసూచికలు 1&2 చూడండి) సిటీ ఉద్యోగులు, హైదరాబాదు కార్పొరేషన్ వారి ప్రసూతి, శిశు సంక్షేమ కేంద్రాలలో అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు పొంది, వైద్య ఖర్చులు తిరిగి వాపసు పొందవచ్చు. ఆ కేంద్రంలోని ఇన్ఛార్జ్ వైద్యుడు అత్యవసర చికిత్సగా ధృవీకరించాలి. '(3) 'రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్' అంటే; మద్రాస్ మెడికల్ రిజిస్ట్రేషన్ ఏక్ట్ 1914 కింద రిజిష్టర్ అయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనువర్తింప జేసుకున్న వ్యక్తి; ఆంధ్రా ఆయుర్వేదిక్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్, రిజిస్ట్రేషన్ ఏక్ట్ 1956, పాత హైదరాబాదు ప్రభుత్వంలో 1932