
ANDHRAMAHABHARATHAMU - STREE PRATIPATTI
₹300
In stock · 80 available
PublisherPROF.TAMMAREDDY NIRMALA
LanguageTelugu
ఎందుకు రాస్తున్నానంటే..... క్రిందట ఆకాశవాణి, విజయవాడ కేంద్రం వారు గురజాడస్త్రీపాత్రలను గురించి ప్రసంగించమంటే ప్రసంగించాను. శ్రోతలనుంచి ప్రశంసిస్తూ చాల ఉత్తరాలు వచ్చినా యట. మూడునెలల కొకటి చొప్పున ఇంకా కొన్ని స్త్రీపాత్రలను గురించి ప్రసంగించమన్నారు. వాటికి వచ్చిన ప్రతిస్పందన నాకు తెలిసింది. శ్రోతలకు అంతగా నచ్చ దీనికి గల కారణం కూడ అర్థమైంది. అదేమిటంటే అంతకుపూర్వపు రచనలకంటే ఇప్పుడు రాసినవి కొంత భిన్నంగా ఉండటమే. నేను వీటిని స్త్రీలకోణంనుంచి ఆలోచిస్తూ రాయటమే. ఈవిధమైన ఆలోచన పోవటానికి కారకులు మానాన్న తమ్మారెడ్డి సూర్యనారాయణగారు. ఆయన నాతో చదివించిన పుస్తకాలు. ఆ పుస్తకాలను చదవటంవలన నాకు మార్చిజంగురించీ కుటుంబవ్యవస్థగురించీ అవగాహన ఏర్పడింది. అయినాగాని, నా సిద్ధాంత వ్యాసంలో నేనా స్త్రీపాత్రలనుగురించి రాసి ఇప్పుడు నా ఈ ఆలోచనతో రాయలేదు. ఎందుకంటే దాని పరిధి వానికి ఉంటుంది గాబట్టి. సిద్ధాంత వ్యాసరచనలోని నియమాలను పాటించాలి గాబట్టి. తరువాత నేను రాసిన విమర్శనాత్మక వ్యాసాలలో నేను ఆ పరిధిని పాటించలేదు. నా అవగాహన ప్రకారం రాశాను. ఆ అవగాహనతోనే యు.జి.సి. వారు ఇచ్చిన రెండు ప్రాజెక్టులను కూడ పూర్తిచేశాను. అవి "రచయిత్రుల సాంఘిక నవలల్లో స్త్రీ" అనేది, తెలుగు సాహిత్యంలో స్త్రీప్రతిపత్తి" అనేది. అయితే, నేను వాటిని పుస్తకాలుగా అచ్చువేయించలేదు. కాని అప్పటినుండి “ఆంధ్రమహా భారతంలో స్త్రీ ప్రతిపత్తి" అనే అంశం మీద రాయాలని మనసులో ఆలోచన ఉంది. ఇంత కాలానికి అది కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఈ రచనను నాకున్న అవగాహనతోనే రాశాను. కాని, మహాభారతరచనా