
ANDHRAPRADESH/TELANGANA UDHYOGULA PRAYANA BHATYALA NIYAMAVALI,1996
₹300
In stock · 1 available
PublisherASIA LAW HOUSE
LanguageTelugu
ALL ABOUT ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఉద్యోగుల ప్రయాణ భత్యాల నియమావళి - వివరణలు విశదీకరణలు A.P.C.S. T.A. Rules 1996 (with Orders in RPS 2015) Chapter - I A.P.T.A Rules టి.ఏ. రూల్సు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ బాధ్యతలు నిర్వహించుటకు ముఖ్య స్థావరం నుంచి బయటి ప్రదేశాలకు ప్రయాణాలు చేసినపుడు వారికి అదనపు ఖర్చుల నిమిత్తం, ప్రయాణ భత్యాలు చెల్లించుటకు నియమ నిబంధనలు నిర్దేశిస్తూ, ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ మాన్యువల్ (Manual) ఆఫ్ ప్రత్యేక జీత భత్యముల యందలి రెండవ భాగములో విశదీకరించియుండిరి. కాని కాలక్రమేణా వాటియందు మార్పులు, సవరణలు వచ్చినందున వాటినన్నింటిని క్రోడికరించి దరిమిలా "ఆంధ్రప్రదేశ్ ప్రయాణ భత్యాల 2, 1996" (AP Travelling Allowance Rules, 1996) ລ້ ລ້ ప్రభుత్వం జారీ చేసింది. దరిమిలా ఆ పేరును ఏ.పి. సివిల్ సర్వీసెస్ ప్రయాణ భత్యాలు 2, 1996 )A.P.C.S. (Travelling Allowance) Rules, 1996( ח మార్పు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ నియమావళులు, యధాతథంగా ఆమోదిస్తూ, 2015 యందు సవరించబడిన వేతన స్కేల్సుయందు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ ఉత్తరువులు జారీ చేయటం జరిగింది. 1. ఎవరికి వర్తిస్తాయి : పై నియమావళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ, అధికారం (control) నకు లోబడి పని చేయుచున్న ఉద్యోగులకు, ఎవరికైతే మూలాధార నియమాలు (Fundamental Rules) వర్తిస్తాయో, మరియు ఎవరి జీత భత్యాలు రాష్ట్ర -కన్సాలిడేటెడ్ ఫండు (Consolidated Fund) కు ఖర్చుగా భరిస్తారో, మరియు ఈ నియమావళి వర్తిస్తాయని ఏదైనా సంస్థ తన ప్రత్యేక నియమావళి (Special Rules) లో నిర్దేశించిన అట్టి ఉద్యోగులందరికీ ఇవి వర్తిస్తాయి.