ANDOLANA PADAKANDI ANANDAMGA JEEVINCHANDI - HOW TO STOP WORRYING AND START LIVING by DALE CARNEGIE Telugu book cover

ANDOLANA PADAKANDI ANANDAMGA JEEVINCHANDI - HOW TO STOP WORRYING AND START LIVING

by DALE CARNEGIE

₹299
In stock · 2 available
PublisherMANJUL PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788183227841
ఏ రోజుకారోజు జీవించండి 1871 వసంతకాలంలో ఒక యువకుడు ఒక పుస్తకం తీసుకుని కొన్నిమాటలు చదివాడు. అవి అతని భవిష్యత్తు మీద చాలా లోతైన ప్రభావాన్ని చూపాయి. మాంట్రియల్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్గా ఉన్న ఆ యువకుడు ఫైనల్ పరీక్ష పాసవటం గురించీ, ఆ తరవాత ఏం చెయ్యాలి, ఎక్కడికెళ్లాలి అనే విషయాల గురించీ, డాక్టర్గా ప్రాక్టీసుని ఎలా సాగించాలనేదాని గురించీ, భవిష్యత్తులో తన సంపాదన గురించీ చాలా విచారించసాగాడు. 1871లో ఈ యువకుడు, ఈ వైద్యవిద్యార్థి, చదివిన ఆ కొన్ని మాటలూ, అతను ఆ తరంలోకెల్లా పేరుపొందిన డాక్టరుగా తయారవటానికి సహాయపడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జాన్స్ హాప్ కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ని అతను ఏర్పాటుచేసాడు. ఆక్స్ఫర్డ్లో రెజియస్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్' అయాడు. బ్రిటీషు సామ్రాజ్యంలో డాక్టర్లకి ఇవ్వబడే అతిపెద్ద గౌరవం అది. ఇంగ్లండు రాజు అతనికి 'సర్' బిరుదు ప్రదానం చేశాడు. అతను చనిపోయాక, అతని జీవితచరిత్రని తెలిపేందుకు, దానిని రెండు పెద్ద గ్రంథాలలో, 1466 పేజీల్లో పొందుపరచవలసి వచ్చింది. అతని పేరు సర్ విలియమ్ ఆస్లర్. అతను 1871లో చదివిన కొన్ని మాటలు, థామస్ కార్ల్ రాసినవి. అతని మనస్సులోని చింతని పోగొట్టిన ఆ మాటలు 'దూరంగా, మసకగా ఉండే దాన్ని చూడటం మనం చెయ్యవలసిన ముఖ్యమైన పని కాదు. చేతికందే దూరంలో, స్పష్టంగా కనిపించే దానిని చేపట్టటమే మన కర్తవ్యం.' నలభై రెండేళ్ల తరవాత, ఒక అందమైన వసంతరాత్రి విద్యాసంస్థ ఆవరణలో ట్యూలిప్ పువ్వులు పూస్తున్న వేళ, ఈ వ్యక్తి, సర్ విలియమ్ ఆస్లర్ యేల్ విశ్వవిద్యాలయం విద్యార్థుల ఎదుట ఉపన్యసించాడు. విద్యాలయాల్లో ప్రొఫెసర్ పనిచేసి, జనరంజకమైన ఒక పుస్తకాన్ని కూడా రాసినా నాలుగు విశ