
ANEKA SAHITYA VYASA SAMPUTI
₹60
In stock · 60 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
దర్పణం నూరేళ్ళ రంగస్థల “సురభి”ళాలు తెలుగు నాటకరంగ చరిత్రలో ఎన్నో నాటక సమాజాలు వెలిశాయి. అందులో కొన్ని వృత్తి నాటక సమాజాలైతే మరికొన్ని ఔత్సాహిక నాటక సమాజాలు. ఎక్కువ సమాజాలు పౌరాణిక, జానవద ఇతివృత్తాలతో ప్రేక్షకుల హృదయాలను రంజింపచేయడంలో పోటీ పడుతుండేవి. సాంఘిక సమస్యలను తమ నాటకాలకు ఇతివృత్తాలుగా స్వీకరించి ప్రజలలో అభ్యుదయ భావాలను ప్రచారంచేసే సదాశయంతో కొనసాగేవి కొన్ని నాటక సమాజాలు. అందుకు ఉదాహరణగా 1880 సంవత్సరంలో ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారి ఆధ్వర్యంలో ఏర్పడిన నాటక సమాజాన్ని పేర్కొనవచ్చు. ఎన్నిటికో ఆద్యులైన వీరేశలింగం పంతులుగారు తెలుగునాట తొలి నాటక సమాజాన్ని ఏర్పరచి ఇందులోకూడా ఆద్యులైనారు. ఈ సమాజం ఆధ్వర్యాన కందుకూరి వారు రచించిన 'వ్యవహార ధర్మబోధిని' అన్న ప్రహసనాన్ని 1880 సం॥లో వినోదార్ధముగా విజయనగరం మహారాజావారి బాలికా పాఠశాలలో ప్రదర్శించారు. ఆంధ్రదేశంలో తొలి నాటక ప్రదర్శనం యిదే: అయితే ఆ నాటక సమాజాలన్నీ యిప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. ఒక శతాబ్దం క్రితం ప్రారంభమై ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటూ తమదంటూ ఒక ప్రత్యేక బాణితో నిర్విఘ్నంగా నేటికి కొనసాగుతూ తెలుగు నాటక రంగ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగిన ఏకైక సంస్థ “సురభి నాటక సమాజం.”