ANKURA - PADYA KAVITHALU by AMARAVATHI PUBLICATIONS Telugu book cover

ANKURA - PADYA KAVITHALU

by AMARAVATHI PUBLICATIONS

₹80
In stock · 6 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
తొలి మొలక అవును, ఇది అంకురమే. నా సాహిత్య సాధనలో పద్యం తొలి మొలక. తొలి వలపు. ప్రాథమిక పాఠశాలలోనే బడికి వెళ్లగానే పాఠాలకు ముందుగా పంతులుగారు ప్రార్ధన పద్యాలు చదివించేవారు. 'తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్...', వెనువెంటనే 'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై...' అనే పోతన గారి పద్యం. ఈ రెండూ ఆప్పటికీ ఇప్పటికీ మనస్సులో హత్తుకు పోయాయి. నా పద్యప్రేమకు అదే నాంది. ఐదో తరగతిలో భాగవతము, మనుచరిత్ర, శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, ఆంధ్రనాయక శతకము మొదలైన వాటిల్లో పాఠాలుండేవి. అవన్నీ కంఠస్థం చేసేవాడిని. ఏడో తరగతిలో పద్యాల జ్ఞాపకశక్తి పోటీలో 'పిల్లల టాగూరు' పుస్తకం బహుమతిగా వస్తే చదివాను. అంతటి కవిని కావాలనే కోరిక ఏదో లోలోపల తడిలో విత్తనమైంది. ఎప్పుడో తొమ్మిదో తరగతిలో ఉండగానే కవిత్వం అంకురించింది. తెలుగు పంతులుగారు క్లాసు పిల్లలతో 'మారుతీ వ్యాకరణము' కొనిపించారు. అందులో ఛందస్సు చూసి అభ్యాసం చెయ్యటం మొదలుబెట్టాను. 'వాయుపుత్రుడు లంకను వేగ జేరె' - ఇదీ తొలి పాదం. 'ఆదిలోనే హంసపాదు' అన్నట్టు యతిభంగం. ఆ పద్యం ఇప్పటికీ పూర్తి కాలేదు! అయినా అట్లా అట్లా పోతన పద్యాలు, తిక్కన పద్యాలు, శతకపద్యాలు చదువుతూ పద్యరచన సాగించాను. ఆది దేవుడు, శ్రీకృష్ణ దేవరాయలు, సంక్రాంతి - ఇట్లా ఏవేవో. హిందీ మాష్టారు ఈదర రామకోటయ్య గారు ఆ పద్యాల్లో తప్పొప్పులు చెపుతుండేవారు. ఆ దశలో పోతన చాలా ఇష్టమైన కవి. క్రమంగా తిక్కన. ఇంకా కథలు, కవితలు అల్లేవాడిని. కాలేజీ చదువు కోసం గుంటూరు వచ్చినాక పద్య కవితలు, వచన కవితలు అల్లటం బాగా అలవాటయ్యింది. కొన్ని వేల పద్యాలు ధారణ చేశాను. ఆశువు కూడా చెప్పేవాడిని. ఇక అధ్యాపక వృత్తిలో తరగతి గదిలో తెలుగు బోధించేటప్పుడు ఆ పద్యాలన్నీ కంఠగతమే గనుక ఎప్పుడూ పాఠ్యపుస్తకం చూసేవాడిని కాదు. డా॥ పాపినేని శివశంకర్