
ANTHAH SOUNDARYAM
₹100
In stock · 359 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400132
ANTHAHSOUNDARYAM (katha Samputi) by Cheruku Sailaja బాహ్య సౌందర్యం అంటే పైకి కనిపించే అందం. అంతఃసౌందర్యం అనగా లోపల వుండే మంచితనము. 'అంతఃసౌందర్యం' కథా సంపుటిలోని కథలు సామాన్యమైన జీవిత విధానంలోని అంతఃసౌందర్యాన్ని తెలియజేస్తాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్కరీతిగా మన చుట్టు ప్రక్కల జరుగుతున్న విషయాలే అన్నట్లుగా కనిపిస్తాయి. అన్ని కథల్లో స్త్రీ పాత్ర యొక్క ఉనికి కనబడుతుంది. ఓ మాతృ హృదయ తపన, పెళ్లి చేసుకున్న యువతి ఎదుర్కొంటున్న సమస్య ఓ కథలో, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి యొక్క మానసిక ఒత్తిడి పెళ్లిచూపులు కథలో, పెళ్లి అయి విడిపోయి మరల ఒకటైన జంట ఇంకో కథలో, ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆలుమగల అనురాగం తెలిపే ఒక కథ, అందంగా లేదని భార్యని పెళ్ళిచేసుకుని దూరంగా పెట్టిన ఒక భర్త కథ. ఇలా ఒక్కొక్క కథలో ఒక్కొక్క విషయం దాగి వుంది. అదే ఈ అంతఃసౌందర్యం సంపుటిగా ఆవిష్కృతమైంది. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహించి ఆదరిస్తారని ఆశిస్తూ.... విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004 ISBN: 978-93-91400-13-2