ANTHARNETRAM KATHA SAMPUTI by AITA CHANDRAIAH Telugu book cover

ANTHARNETRAM KATHA SAMPUTI

by AITA CHANDRAIAH

₹80
In stock · 493 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సన్మానం శాలువా! “ఈసారి పంద్రాగస్టు జండా వందనానికి మినిస్టర్ వస్తున్నారు. మీ పట్టణ కార్యక్రమములో పాల్గొంటారు. అందులో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన ముంటుంది. మీ ప్రాంతములోని స్వాతంత్య్ర సమరయోధుల్ని గౌరవంగా తీసుకురావాలి" జిల్లా కలెక్టర్ ఆదేశం ఆర్టీవో ద్వారా తహసీల్దార్ చేతికొచ్చింది. ఎప్పుడో జరిగిపోయిన స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వాళ్లింకా బతికున్నారా తహసీల్దారు అతలాకుతలమయ్యాడు. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవా!... ధైర్యం పుంజుకున్నాడు. విలేజ్ అసిస్టెంట్సు నందరినీ సమావేశపరచి "స్వాతంత్య్ర సమరయోధుల్ని వెతికి పట్టుకురావాలే" ఫర్మానా జారీ చేశాడు. అందరూ టపా కట్టేశారు. దుర్భిణిపట్టి వెతికినా దొరకరు.... విలేజ్ అసిస్టెంట్సు వాదన సారాంశం. తహసీల్దార్ బుర్రలో బొంగరాలు తిరిగినై. మొహమ్మీద ముచ్చెమటల ఛాయలు కనబడ్డాయి. “అట్లెట్లా? కనీసం.... ఒక్కరినన్నా పట్టుకరాకపోతే మన ఇజ్జత్కు ఇంగులం పెట్టినట్టైతది" గుర్కాయించాడు. ఓ విలేజి అసిస్టెంటు అనుమానంగా లేచాడు "మా ఊర్లె గాలయ్య ఉన్నాడు. ఎనభయ్యైదేండ్లు దాటిన ముసలోడు" చల్లని వార్తమెల్లగా చెప్పాడు “స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నడట” “వెరీగుడ్! మీ గ్రామ సర్వంచ్కు ఫోన్ చేస్తా, అతణ్నే పట్టుకు రమ్మని కావాలంటే మన జీబు తీస్కపోయి ఆ పెద్ద మనిషిని గౌరవంగా తోలుకరావాలని" తహసీల్దారు పెదాలమీద చిరునవ్వు చిందులేసింది. కరకర పొద్దుపొడుస్తోంది. సూర్యకిరణాలు భూమాతకు రంగులద్దుతున్నాయి. "గాలయ్య తాతా! ఓ గాలయ్య తాతా!" సర్పంచ్ తలుపు కొడుతూ గట్టిగా పిలిచాడు. జ్వరంతో బాధపడ్తున్న గాలయ్యకు వినబడింది. కాని చేతకాలేదు. "అరేయ్ నారిగా! ఎవలో వచ్చిండ్రురా! "మనవణ్ని కేకేసాడు... మూల్గుతూ”. నీ యవ్వ.... కమ్మని