
ANTHARVANI
₹40
In stock · 3 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
నా పేరు కొసరాజు కృష్ణప్రసాద్. జన్మస్థలము రావివారిపాలెం (మోపిదేవి మండలం), కృష్ణా జిల్లా. ఈ పుస్తకం నేను వ్రాశాననే తలపు, నాకే ఆశ్చర్యం కలుగజేస్తుంది. మన తెలుగుజాతి ఆణిముత్యాలైన మహాకవులే అంతరంగమున ఉండి. నా చేత వ్రాయించారని, వారి ప్రోద్బలముతోనే సాధ్యం అయ్యిందని, నా భావన. అందుచేత ఈ ప్రతిభ కేవలం నాదనే అభిప్రాయము లేదు. నా ద్వారా తెలుగువారితో వారు పంచుకున్న సాహిత్యమని మాత్రమే భావింప మనవి. ఇది వారియందున్న అభిమానముతో నా అంతరంగ భావనయే తప్ప, అన్యధా భావింపవలదు. నేను వారి సాహిత్యం అంతగా చదవకపోయినా, నాకు ఈ మహాద్భాగ్యం కలిగించిన ఆ మహానుభావులకు సర్వదా కృతజ్ఞుడను. "వ్రాసితిని, వ్రాసితిని, అలుపెరగనట్లు దేవరాయలు నన్ను దర్బారుకేబిల్వ, అష్టదిగ్గజములంచ నిలుచుండినట్లు. విశ్వనాథుడె వచ్చి వల్లె వేయగ నాకు, శ్రీశ్రీయె శిరముపై సేదదీరుచునుండ -దాశరథి దరిజేరి దారిజూపుతు ఉంటె, నారాయణుడె నన్ను నడిపించినట్లు, వ్రాసితిని, వ్రాసితిని, అలుపెరగనట్లు, నే వ్రాసితిని, వ్రాసితిని, అలుపెరగనట్లు!” విశ్లేషణ "కృష్ణప్రసాద్ కవితల్లో మనకు అర్ధగాంభీర్యంతో పాటు శబ్దసౌష్టవం కూడా అద్భుతమనిపిస్తుంది. అభ్యుదయం, సామాజికప్రయోజనం, సమాజం పట్ల ప్రేమ, ఉన్నత విలువలు, ఉదాత్త ప్రమాణాలను ప్రతిబింబించే కవితలెన్నో ఉన్న కవిత్వ సంపుటి, కృష్ణప్రసాద్ రాసిన ఈ 'అంతర్వాణి'.” - కవి యాకూబ్