
ANTHARYAPU LOTHULU - GOING DEEPER
₹250
In stock · 18 available
PublisherINNOVATIVE WORKS
LanguageTelugu
అధ్యాయం - 1 ప్రారంభ ప్రకటన కుక్కలు, వాటి యజమానులు సంపూర్ణమైన జత లాగా కనిపించడం నాకెప్పుడూ ఉల్లాసంగానే వుంటుంది. ఆశ్చర్యకరంగా మోజార్ట్ సింఫనీ, చక్కటి సూర్యాస్తమయంలా ఒకే రీతిలో ఏ తేడా లేని కవలలు భిన్నరూపాల్లో ప్రత్యక్షమైనట్లు కనిపిస్తారు. అసలు వాళ్ళు మొదటి నుంచీ అలానే ఉన్నారా అని నాకు ఆశ్చర్యం -మనుష్యులు అనుకోకుండానే తమ పెంపుడు జంతువుల వైపు లాగబడతారా లేకపోతే జంతువులూ మనుష్యులూ తమ మధ్య బంధం గాఢమయ్యేకొద్దీ ఒకే వేదికను కనుగొంటారా? అంతేకాదు, తనకూ, 'జ్యూస్' కూ సామ్యమైన సంగతులు ఎన్ని ఉన్నాయో మిగిలిన వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుందని కూడా అనిపిస్తుంది. జ్యూస్ అద్భుతమైన జన్యు నిర్మాణంతో వుంటాడు. ప్రతి విషయాన్నీ పంచుకుంటాడు. బొడ్డుకు దగ్గరగా వుండే రంగులో వుంటాడు కానీ పరిమాణం మాత్రం జర్మన్ షెవర్డ్ కంటే తక్కువే. వాడికి 'స్ప్రింగర్ స్పానియెల్' వంటి వేటాడేతత్వమూ, 'ఫ్రెంచి పూ డిల్' వంటి తెలివీ వున్నాయి. వాడు వాటన్నిటిలోని కొంత కొంత భాగాన్ని కలిగి వున్నాడు. పశువుల వైద్యుడు "వీడు ప్రత్యేకమైనవాడు" అని నిర్ధారించి "ఏ AKC పోటీలలోనూ, ఎన్ని విభాగాలున్నా ఒక్కదానిలో కూడా విజయం సాధించలేడని, ఇప్పటికే వాడు నాలుగైదు విభాగాలలో ప్రవేశించి వున్నా విజయం మాత్రం పొందలేదు" అని తేల్చి చెప్పాడు. క్లాడ్ కోవెన్