ANTONIO GRAMCI JEEVITHAM KRUSHI by SUSIE THARU Telugu book cover

ANTONIO GRAMCI JEEVITHAM KRUSHI

by SUSIE THARU

₹80
In stock · 417 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ANTONIO GRAMSCI JEEVITHAM - KRUSHI By: Susie Tharu "మార్క్స్, ఏంగెల్స్ ల పరిశోధనను కొనసాగించడానికి నిజంగా ప్రయత్నించిందెవరు? గ్రాంసీయే.” లూయీ ఆల్తూజర్ గ్రాంసీ (1891-1937) ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు, 1924-26 మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన మేధో క్రియాశీల జీవితం రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలపు పరిస్థితులతో పెనవేసుకపోయింది. రాజ్యం -0 - పౌరసమాజం, రాజకీయాల విశేష ప్రాధాన్యత, పాలకవర్గాల ఆధిపత్యాన్ని కొనసాగించడంలో బలప్రయోగానికి, భావజాలం ద్వారా సాధించే సమ్మతికి మధ్య ఉండే సంబంధం, చారిత్రక సంఘటన, సజీవ మేధావులు, నైతిక, రాజకీయ సంస్కరణ మొదలైన తన భావనల ద్వారా మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని విశేషంగా గ్రాంసీ ప్రభావితం చేశారు. సామాజిక మార్పుకై జరిగే అన్వేషణలో మార్క్సిస్టు సిద్ధాంతపు అనుగుణ్యతను తిరిగి పరిశీలించవలసిన అవసరం తీవ్రంగా ఉన్న నేటి తరుణంలో గ్రాంసీ భావాలు ఇందుకు తగిన సైద్ధాంతిక ప్రాతిపదికను ఏర్పరచగలవు. హైదరాబాద్ లోని సి.ఐ.ఇ.ఎఫ్.యల్.లో ప్రొఫెసర్గా పనిచేసిన సుశీ తారు ఈ పుస్తకాన్ని రచించారు. వీరు ఫెమినిస్టు ఉద్యమంలో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్నారు. స్త్రీ శక్తి సంఘటన, అన్వేషి లాంటి సంస్థలలో సభ్యులు. కవి, పాత్రికేయులు హెచ్చార్కె ఈ పుస్తకానికి తెలుగు అనువాదం చేశారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004