
ANUBANDHALU ANTHARALU
₹90
In stock · 112 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Anubandhalu - Antharalu by: Koneru Kalpana అనుభూతులెన్నెన్నో!! మానవత్వాన్ని మరువకుండ మనుగడ సాగిస్తే మరువపు పరిమళంలా మనసంతా ఆత్మీయత అల్లుకుపోతుంది. ఆ అనుబంధాలను పదిలం చేస్తుంది. స్వార్థం సఖ్యతను చేజార్చితే, అహంకారం అధఃపాతాళానికి తొక్కేస్తుంది. మన బ్రతుకు బాటలు వేరైనా మన గుండెల్లో బలంగా నాటుకునే సన్నివేశాలు కొన్నుంటాయి. కొన్ని పాత్రలు 'భుజాలు తడుముకునేలా' చేస్తే, మరికొన్ని మన నేస్తాలే భుజంతట్టి కరదీపికలౌతాయి. “అరే! వీడు మనవాడే” ననిపించి మనసును మురిపిస్తాయి కొన్ని. మన ఇంట్లో, మన చుట్టూ వున్న మన వాళ్ళతో కాసేపు మన మనసులోని మాట పంచుకున్నట్లు వుంటాయి ఈ అనుబంధాలు - అంతరాలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004