
ANUBHAVA VEDANTHAMU GEETASARAMU
₹150
In stock · 324 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400552
ముందుమాట - పుల్లప్ప గారు రచించిన "అనుభవ వేదాంతము, గీతాసారము” అనే ఈ గ్రంథములో శ్రీ భగవద్గీతలో ఉన్నవాటితోపాటు, ఇతరమైన ఆధ్యాత్మిక విషయాలు పొందుపరచినందు వల్ల చదువరులకు ఎంతో కుతూహలము కలుగు తూంది. శంకరభాష్యము, ఉపనిషత్తులు, శ్రీ రమణ మహర్షి ఉపదేశములు, కచూడామణి, భజగోవిందము, నిర్వాణషట్కము లోని విషయాలను అనేకము పొందుపరచినారు. శ్రీ పుల్లప్ప గారు ఉద్యోగరీత్యా విరమణ పొంది విశ్రాంతి తీసుకొన వలసిన సమయములో కూడా సమాజానికి సేవ చేయాలనే సదుద్ధేశ్యముతో సుమారు రెండు సంవత్సరములకు పైగా కష్టపడి సులభశైలిలో సామాన్యు లకు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేయడం కోసము ఈ గ్రంథాన్ని ధరించి కృతకృత్యులయ్యారు. వీరికి దైవకృప, గురుకృప, శాస్త్రకృప బాగుగా సహకరించినవి. వీరు చేసిన ఈ ప్రయత్నము అద్భుతం, హర్షణీయం, అమసరణీయం. ఈ గ్రంథములో ప్రధానంగా తనను తాను తెలుసుకొనుటకు ముఖ్యముగా నిష్కామకర్మ, రాగద్వేష రహితము, ప్రాపంచిక విషయాల యందు ఆసక్తిని వదలి, త్యాగబుద్ధితో పరోపకారము అలవరచుకొని అనన్య భక్తితో భగవంతుని సేవించి, ఆయన అనుగ్రహమునకు పాత్రులై మోక్షము పొందగలరని బోధిస్తుంది. శుభం భూయాత్, లోకా సమస్తా సుఖినో భవంతు, సహృదయముతో, శ్రీ భూపాళం పద్మనాభయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురము.