
ANUBHAVALU - GNAPAKALUNU
by SRIIPADA SUBRAHMANYA SASTRY
₹600
In stock · 49 available
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789347318139
అనుభవాలూ - జ్ఞాపకాలూను ఉపక్రమణిక మిత్రులు శ్రీ నీలంరాజు వేంకటశేషయ్యగారు, తమ నవోదయ కోసం నా అనుభవాలూ-జ్ఞాపకాలూ రాసి పంపమని అడిగారు. ఒకమాటు కనపడినప్పుడడిగారు, మరోమాటు కార్డు రాశారు, చివరి కింకోమాటు కలుసుకున్నప్పుడు తప్పదంటూ తొందరకూడా చేశారు. దీనికి సాయం, అంతక్రితం, ఆనందవాణి పత్రికలో చిన్ననాటి నా దీపావళి ముచ్చట్లు చదివివుండిన మిత్రులు, అటు వేంకటశేషయ్యగారి సంకల్పం మిక్కిలీ ప్రశంసించి, యిటు రచన సాగించమని ప్రోత్సాహపరిచారు నన్నెంతో. "కాదు" అనలేకపోయాన్నేను. నేనెప్పుడూ అనుకోని విషయం, ఇది. నిజంగా, నాకిది మిక్కిలీ కొత్త ప్రేరణ. అయినా, వారందినాలు గడిచేటప్పటికే స్థాయి భావం యేర్పడిపోయింది నాకీ విషయమై. ఇలాంటి రచనల విలవ గుర్తించిన తెలుగు పత్రికల్లో నాకు తెలిసినంతవరకూ నవోదయ రెండోది. అంతకిముందు, కీ.శే. శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రజామిత్ర పత్రిక బ్రహ్మశ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూ(?) కొన్ని ప్రకటించి వుంది. అయితే, తెనుగు పత్రికల్లో మరి దేనికిన్నీ యీ విషయం ఆకర్షకం కాలేకపోయింది. వాటికి నేడు నవోదయ మాత్రమే పూనుకుందిందుకు దృఢంగా. ఇంగ్లీషులో యీరకం రచనలు చాలా వున్నాయిట, తెనుగులో మాత్రం అదే మొదటిది నేను చూసినంతవరకూ. అనుభవాలూ - జ్ఞాపకాలూను