
ANURAGA MALIKA
₹100
In stock · 5 available
PublisherPANTHULA VENKATESWARARAO
LanguageTelugu
కవి పలుకు పూర్వకాలం నుండి ఎందరో రచయితలు కీర్తనలు, పదాలు, గేయాలు, జనపదాలు సంగీత రూపకాలు ఇలా అనేక రకాలుగా గీతరచన చేస్తున్నారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య రామదాసు వంటి మహానుభావులు తమ గీతాల ద్వారా సాహిత్య లోకంలో గొప్పవారిగా ప్రశంసింపబడుతున్నారు. నాటి నుండి నేటి వరకు ఎందో సినీ రచయితలు, జానపద లలిత గేయాలు రచయితలు గీత రచన చేస్తున్నారు. ఈ మధ్యనే కాలం చేసిన మా తండ్రిగారు శ్రీ పంతుల సూర్య ప్రకాశరావు గారు ఎన్నో హరికథా కీర్తనలు, భజన పాటలు, జానపద గేయాలు, వీధినాటకాలకు గీతాలు రాశారు. ఆయన రాసినవి, భజనలలో మా స్వగ్రామలైన శ్రీకాకుళం జిల్లా చాపర, కుద్దిగాం గ్రామాలతో పాటు చుట్టు పక్కల 35 గ్రామాల వరకు నేటికీ పాడుతున్నారు. వారి స్ఫూర్తితోనూ, మా చిన్న అన్నయ్య కీశే సీతా రామశాస్త్రి (సూరిబాబు) ప్రేరణతోను గీతరచనకు శ్రీకారం చుట్టాను. నేను ఇంతకు పూర్వం పనిచేసిన ఒక పాఠశాలలో కొన్ని పాటలు విద్యార్థులచే పాడించటం జరిగింది. అందులో చదువులరాణీ అనే పాట కీర్తనలా ఇప్పటికీ కొన్ని స్కూళ్ళు ప్రార్థనాగీతంగా పాడుతున్నాయి. ప్రస్తుతం నేను పనిచేస్తున్న విజయవాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా యాజమాన్యం ప్రోత్సాహంతో కొన్ని పాటలు రాయడం జరిగింది. అందులో కొన్ని రిమిక్స్న రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. వార్షికోత్సవాలలో ప్రదర్శించడం జరిగింది. మా శ్రీమతి గాయత్రీ కుమారి సహచర్యంతో కొన్ని ప్రేమ, విరహ, యుగళ గీతాలు రాయడం చేశాను. ఇలా ఈ పుస్తకంలో దైవ, భక్తి, ప్రేమ, విరహ, యుగళ, దేశభక్తి, లలిత, విషాద గీతాలు ఉన్నాయి. విఘ్నేశ్వర గీతం నుండి శోభనం పాట వరకు అన్ని ఉన్నాయి. ఈ పుస్తకం ప్రచురణ ప్రారంభం అయినప్పుడు మా తండ్రిగారు జీవించి ఉన్నారు. కాని నేడు లేరు. అందుకే భక్తి గీతాలను వారికి అంకితం చేస్తున్నాను. దేశభక్తి, విషాద గీతాలను సోదరుడు కీ॥శే॥సీతారామశాస్త్రికి అంకితం ఇస్తున్నాను. ప్రేమ, విరహగీతాలను నా భార్యామణి గాయత్రీ కుమారికి అంకితం ఇస్తున్నాను.