
APOORVA RUSSIAN JANAPADA KATHALU
by ANIL BATTULA
₹200
In stock · 7 available
PublisherANIL BATTULA
LanguageTelugu
చిట్టి పొట్టి పాపల్లారా చిరునవ్వుల చిన్నారుల్లారా అల్లీబిల్లీ ఆటలతోటీ అల్లరి చేసే చిరుతల్లారా ఆటలు పాటలు కొంచెం ఆపి చక్కని ఈ కథ వినండి చెబుతా! చిన్నారులూ! నా మొదటి పుస్తకం "రష్యన్ జానపద కథలు" చదివి ఆనందించారు కదూ. మరికొన్ని రష్యన్ జానపద కథల్ని అనువాదంచేసి మీకోసం ఈ పుస్తకం తెస్తున్నాను. ఇందులో ప్రసిద్ధి చెందిన గొప్ప రష్యన్ చిత్రకారుల చక్కని బొమ్మలున్నాయి. మీలాగే నాకూ బొమ్మలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు రాత్రిపూట మా అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ, ఆకాశంలోని చందమామలో అస్పష్టంగా కనిపించే చిత్రాల్ని చూపిస్తూ, చందమామలో ఓ ముసలమ్మ రాట్నం వడుకుతూ తన కొడుకు కోసం ఎదురుచూస్తుందని చెప్పేది. ఎప్పటికైనా ఆ కొడుకు తల్లిని చేరుకోలేకపోతాడా అని రోజూ ఆ కథ ఆసక్తికరంగా వినేవాడ్ని. ఆ తరువాత రంగురంగుల బొమ్మలంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. బొమ్మల్ని చూస్తూ ఎన్నో చక్కటి కథల్ని చదివాను. చిన్నప్పుడు నేను చదివిన చందమామ, బాలమిత్ర కథలు ఇప్పటికీ గుర్తున్నాయి. అందుకు కారణం కథల్లో ఉన్న బొమ్మలే. అలా చిన్నప్పుడే బొమ్మల ప్రేమలో పడ్డాను. మీకు కూడా నాలాగే అందమైన బొమ్మలున్న కథల పుస్తకాలంటే ఇష్టం కదూ! ఇందులో ఉన్న చక్కటి జానపద కథలు, చిత్రకారుల రంగురంగుల బొమ్మలు మీకూ నచ్చుతాయి. మరిక ఆలస్యం ఎందుకు? చదివి ఆనందించండి.!