
APPU NIPPU PILLALA KATHALU - 50.00
₹50
In stock · 732 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
1. సత్కార్యాలు విజయపురిలో విశ్వపతి అనే జమిందారు వుండేవాడు. ఆయనకు దైవభక్తి ఎక్కువ. దేవుడికి రోజూ పూజలు చేసేవాడు. ఒక శుభదినం విజయపురిలో ఉత్సవం ఏర్పాటు చేశారు. విశ్వపతి పట్టువస్త్రాలతో, పూజా సామాగ్రితో దేవాలయానికి పూజారి మాధవాచారితో, కొందరు పెద్దలతో కలిసి బయలుదేరాడు. ఏదైనా అవసరానికి పనికొస్తాడని నౌకరు రంగయ్యను కూడా వెంట రమ్మన్నాడు. ఆలయానికి వెడుతున్న వారికి దారికి అడ్డం పడివున్న ముసలి భిక్షగాడు కనిపించాడు. వాడిని అడ్డు తొలగించమని రంగయ్యతో చెప్పాడు విశ్వపతి. "కడుపు నొప్పితో కదలలేని స్థితిలో వున్నాను" అన్నాడు భిక్షగాడు. భిక్షగాడిని పక్కకు లాగి "ఈ భిక్షగాడు కడుపు నొప్పితో పడిపోయాడు.