
ARDHA NOOTAPADAHARLU
₹250
In stock · 425 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400811
మామూలుగా పెళ్లిళ్లు, వేడుకలకు సంబంధితుల ఆహ్వానాలను పురస్కరించుకుని వెళ్ళే ఆహ్వానితులు ప్రేమపూర్వకంగా తమకు తోచినంత నగదో, కానుకలో చదివిస్తారు. నగదైతే పాతకాలంలో అర్థనూటపదహార్లు (58), నూటపదహార్లు (116), వెయ్యి నూటపదహార్లు (1,116)గాని అంతకుమించి గాని వారివారి ఆర్థిక స్థోమతను బట్టి చదివింపులు చేసేవారు. నేనుకూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ రసజ్ఞులైన పాఠకులకు కానుకలుగా: ప్రేమభావప్రకటితములుగా ప్రభవించిన గజల్స్ని ముందుంచి, ఆపై చిన్ననాటినుంచి నేను రాసిన కవితలను వర్గీకరించి, వాటి తరువాత నాటినుంచి నేటివరకు రాయబడిన కథలను క్రోడీకరించి, యాభయ్యెనిమిదిచొప్పున ఇష్టపూర్వకంగా చదివించుకుంటున్నాను. కొన్ని కథలు, కవితలు దశాబ్దాల క్రితమే పత్రికలలో వచ్చినవే. (గజల్స్ తొలి ప్రయత్నం). ఆపై (SBI) ఉద్యోగంలో పదోన్నతులతో బాధ్యతలు పెరిగి, పురిట్లోనే ఆగిన రచనావ్యాసంగం, ఇన్నాళ్లకు ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగం పుణ్యమా అని మారాకువేసింది. ఈ మధ్యనే ఆవిష్కరించబడిన నా శతకాలు, దండకాలు, హైకూలు, నానీలు, ఏకపాత్రల పుస్తకాల లాగే, ఈ పుస్తకంలోని ప్రక్రియలు కూడా పాఠకాదరణకు పాత్రములై పాఠకులచే మళ్ళీ మళ్ళీ చదివించుకుంటాయని, నేను మరింత ఉత్సాహంగా ముందడుగు వేయగల శక్తినిస్తాయని నమ్ముతూ విజ్ఞులైన పాఠకుల దీవెనలు, సూచనలు, సలహాలను ఆశిస్తూ ... ఇళ్ళ మురళీధరరావు