
ARDHASHASTRA KRAMAPARINAMAM
by NIDAMARTHI UMARAJESWARA RAO
₹360
In stock · 483 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
A.V. ANIKIN ARDHASHASTRA KRAMAPARINAMAM by Nidamarthi Umarajeswara Rao 66 "అర్థశాస్త్ర క్రమపరిణామం” అనే గ్రంథాన్ని ఎ.వి.అనీకిన్ అనే ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త రాశాడు. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే అర్థశాస్త్రంలోని మౌలికాంశాలను చారిత్రకంగా అవగాహన చేసుకోడానికి ఈ పుస్తకం బాగా దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడానికి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు కొత్తగా ఏమైనా చెప్తున్నారా? లేక అంతకు ముందు వారి పూర్వీకులు చెప్పిన అంశాలనే పునఃశ్చరణ చేస్తున్నారా? అనే అంశాలను తెలుసుకోడానికి ఈ పుస్తకం సహాయ పడుతుంది. అదే విధంగా గతంలో ఆర్థిక విశ్లేషణలకు అనుసరించిన పద్ధతులను కూడా అవగాహన చేసుకోడానికి ఈ పుస్తకం ఉపయోగ పడుతుంది. మార్క్స్ పూర్వీకుల అర్థశాస్త్ర ఆలోచనల పై ఈ పుస్తకం దాదాపుగా సమగ్రంగా సమాచారాన్ని పాఠకులకు అందజేస్తుంది. రాజకీయ అర్థశాస్త్రంలో ప్రవేశం కావాలనుకునే వారికేగాక, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ (బి.ఏ, బి.కాం; బి.బి.యం; ఎం.ఏ; యం. బిఏ) విద్యార్థులతో పాటుగా, పోటీ పరీక్షలకు సంసిద్ధులవుతున్న విద్యార్థులకు కూడా ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. సులభశైలిలో సంక్షిప్తంగానూ, అవసరమైన చోట వివరణాత్మకంగానూ ఆర్థిక సిద్ధాంతాలు చర్చించబడ్డాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004