AROGYAM-AVAGAHANA by SHANMUKESWARA PRACHURANALU Telugu book cover

AROGYAM-AVAGAHANA

by SHANMUKESWARA PRACHURANALU

₹50
In stock · 15 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
మన దేహం - మనస్సు దేహో దేవాలయః ప్రాక్తో జీవో దేవస్సనాతనః అంటే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క దేవత అధిపతి కాగా “నేను” అనే దైవం హృదయ నివాసిగా వెలుగొందుతున్న సంచార దేవాలయమే ఈ దేహం. సృష్టిలోని సర్వశక్తులను “నేను” అనబడే ఆత్మలో కల్గి ఉన్న ఈ దేహం ఒక అద్భుత పుణ్యతీర్థం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ దేహం సర్వాలంకార భూషితమై శోభిల్లినా, పుట్టుట, పెరుగుట, క్షీణించుట, నశించుట అనే వికారాలకు లోనై మలినమై రోగాలతో మ్రగ్గుతుంది. దేహంలాగా రూపం లేకపోయినా మనస్సు త్రిగుణ తత్త్వాలతో, అరిషడ్వర్గాలతో అల్లుకొని అసత్యాన్ని శాశ్వతమని అశాంతికి లోనవుతున్నది సూక్ష్మ శరీరమే. అంతఃకరణ, చిత్త, బుద్ధి, అహంకారాల సమాహారమే మనస్సు. “మనస్సే”, సర్వవ్యాపకమై బంధ మోక్షాలకు ప్రధాన కారణమయ్యింది. అందుకే మానవుడు ఈ శరీరం, మనస్సులను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో ఆవశ్యకం. సాధకుడు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానమైన అంశాలు, ఆహారం, ప్రత్యాహారం, వ్యాయామం, ప్రాణాయామం, మౌనం, బ్రహ్మచర్యం. ఆహారం ద్వారా లభించే మన జీవశక్తికి ప్రధాన కేంద్రం సూర్యుడు. మంత్రరూపంలో ఆ శక్తిని గ్రహించడమే గాయత్రీ ఉపాసన. అన్నం బ్రహ్మ అంటారు. మన చుట్టూ ఉన్న వృక్షజాతి ఆ సౌర శక్తినే కిరణజన్య సంయోగక్రియ ద్వారా పంచభూతాలతో సమ్మిళితం చేసి ఆకులలో పిండి పదార్థంగా, పుష్పంలో మకరందంగా, ఫలంలో రసంగా మనకు అందించి వాటి జన్మను సార్ధకం చేసుకుంటున్నాయి.