AROGYAME MAHABHAGYAM-60 by ADELLA SIVAKUMAR Telugu book cover

AROGYAME MAHABHAGYAM-60

by ADELLA SIVAKUMAR

₹30
In stock · 1 available
PublisherADELLA SIVAKUMAR
LanguageTelugu
ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన భాగ్యం మరొకటి లేదని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈవిషయాన్ని ఇప్పుడు అందరూఅంగీకరిస్తున్నారు... ఒకప్పుడుతో పోలిస్తే నేడు ప్రజలలో ఆరోగ్యం, ఆహార నియమాల పట్ల, శ్రీ వ్యాయామం చేయడం పట్ల అవగాహన పెరిగింది. అయితే మనలో ఉన్న కొన్ని మూఢ నమ్మకాలు మాత్రం నేటికీ శ్రీ అలాగే ఉండిపోయాయి. ఆహారం విషయంలో ఆరోగ్యం విషయంలో ఈ నమ్మకాలు ఎలా పుట్టాయో చెప్పడం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఈ నమ్మకాల వలన కలిగే మేలుకన్నా కీడే ఎక్కువగా ఉంటోంది. కురుపులు ఏవైనా వచ్చినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు పప్పులు తినకూడదని అంటారు... వంకాయ తింటే వాతం చేస్తుందని మనలో గట్టి నమ్మకం... గోంగూర తింటే వేడి చేస్తుందని దాని జోలికి వెళ్లరు... పిల్లలకు విరోచనాలు అవుతుంటే వాళ్ళు దాహం అని ఎంతగా ఏడ్చినా మంచి నీళ్లు తాగకూడదని నీళ్లు ఇవ్వరు... చెవిలో ఆముదం కానీ, నూనె కానీ వేయకపోతే చెవి పొర ఎండి పోతుందని అంటారు... పాలల్లో పచ్చి గుడ్డు వేసుకుని త్రాగితే చాలా ఆరోగ్యం అంటారు... దిష్టి తగిలిందంటూ ఉప్పు, ఎండు మిరపకాయలు దిష్టి తీసేస్తూ ఉంటారు... ఇలా చెప్తూ పోతే ఇదీ అదీ అని కాదు...మనలో చాలా మూఢ నమ్మకాలు ఉన్నాయి. అవి మనకు మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తున్నాయని చెప్పాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకం రాయడం జరిగింది. మా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము...