ARTHIKA VYAVASTA BASHA by J D PRABHAKAR Telugu book cover

ARTHIKA VYAVASTA BASHA

by J D PRABHAKAR

₹120
In stock · 34 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126061
ARTHIKA VYAVASTHA-BHASHA (Economy - Language) by J.D.Prabhakar స్థానిక భాషలే పారిశ్రామిక ఆధారిత ఆర్థికవ్యవస్థలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి అనే విషయంపై పరిశోధన చేసి నిరూపించిన వివరాలను పొందుపరిచిన పుస్తకం ఇది. మాతృభాషల వాడుకతోనే వివిధ ప్రాంతాలూ సంస్కృతుల మధ్య సమాచార వినిమయం, నూతన ఆవిష్కరణలూ, వస్తూత్పత్తుల మార్కెట్ విస్తరణకు మార్గం సుగమం అవుతోంది. విశ్వవ్యాప్తంగా మార్కెట్లలో, బహుభాషా నైపుణ్యాలు పరిశ్రమలకు విస్తృత వినియోగదారుల ఆదరణ పొందటంలో, అంతర్జాతీయ వాణిజ్య చర్చలు జరపడంలో, భాగస్వామ్యాల విస్తరణకూ సహాయపడుతోంది. ఈ విషయాన్ని పరిశోధించి నిరూపించడమే ప్రధానంగా, తెలుగురాష్ట్రాలలో ఎంపిక చేసిన పరిశ్రమల్లో భాషావిధానం, వివిధ శ్రామికవర్గాల భాషా వినియోగాన్ని పరిశీలించి రాసిన సైద్ధాంతిక వ్యాసానికి చిరుకూర్పే ఈ చిన్న ప్రయత్నం. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిశోధనాంశాన్ని ఎంచుకోవటం ఒక సాహసం. పరిశ్రమల్లో స్థానిక భాషల వాడకం స్థూల జాతీయ ఉత్పత్తి ద్వారా ఆర్థికవ్యస్థకు కీలకంగా మారటాన్ని ఈ పరిశోధన నిరూపిస్తోంది. జనభాషలే మన సమాజ ఆర్థికవ్యవస్థకు మూలమనీ వాటి వాడుకతోనే సమాజంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేది దాగని సత్యం. ప్రజాస్వామ్యంలో ప్రజల మాతృభాషా హక్కుల సాధనకు వివిధ రంగాలలో ఇలాంటి పరిశోధనలు విస్తృతంగా జరిగేందుకు ఈ పరిశోధన తోడ్పడుతుంది. డా|| జె.డి. ప్రభాకర్కు ప్రత్యేక అభినందనలు. గారపాటి ఉమామహేశ్వరరావు తెలుగు జాతి ఎదుర్కొంటున్న అస్తిత్వ సమస్యల వంక దృష్టి సారిస్తూ, దానిని సన్నిహితంగా గమనిస్తూ ఉద్యమంలో పాలుపంచుకొంటున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారి శిష్యుడు డా॥ జె.డి.ప్రభాకర్. ఆయన మార్గదర్శకత్వంలోనే పరిశోధనలో ముందుకు సాగుతున్నాడు. కనుక అందరికీ ఈ సమస్యల పరిష్కారానికి వెలుగుదారిని చూపగల వాస్తవాలను తన పరిశోధన ద్వారా గ్రంథస్తం చేశాడు. ఇదేవిధంగా ఇతర పరిశోధకులూ, వారి గురువులూ ముందడుగు వేయడానికి ఈ ప్రచురణ ఉదాహరణగా నిలుస్తుంది. డా॥ సామల రమేష్బాబు తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు. ISBN 978-93-48126-06-1 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004