ARUDRA CINE GEETHALU 4 by K.RAMALAKSHMI Telugu book cover

ARUDRA CINE GEETHALU 4

by K.RAMALAKSHMI

₹100
In stock · 23 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట తెలుగు సినిమా పాటలు తెలుగు సాహిత్యానికి ఒక శాఖ అని అనలేము. సినిమా పాటలు అవసరాన్ని బట్టి సన్నివేశానుగుణంగా, ఒక్కొక్కప్పుడు వరసకనుగుణంగా రచింపబడినవి. సాహిత్యశాఖగా గుర్తించకపోడానికి కారణం ఇవి ఆత్మానందం కోసమే. సాహిత్యపులోతులు తరచి విశేషాలు ఆవిష్కరించడానికి మేధను మధించి రూపొందించినవి కాకపోవడమే. ఇవి అచ్చంగా సినిమాల కోసం రాసినవి. అయితే, ఎక్కడేనా వీటిలోనూ ఎప్పుడో ఎక్కడో ఒక్కొక్కసారి సాహితీగుబాళింపు తళుక్కుమనిపించినవి లేకపోలేదు. అందుకే సినీగీతం వినాలి. చూడాలి. చదివితే కనిపించే కవిత్వం తక్కువ. సినిమా పాట జనరంజకంగా వుండాలన్నది మొదటి లక్షణం. అందుకే మంచిదైనా, మామూలుదైనా, సినిమా పాట అనుకోని సందర్భాలలో అక్కడక్కడ జనం కళ కానట్టే సినిమా పాటకూడా సాహిత్య ప్రావీణ్యం కలది కాదు. ఇది సంతోషం కల్గించడానికి, వినోదం కల్గించడానికి. నాలుకమీద అడుతూ వుంటుంది. సినిమా ప్రస్తుతం సినిమా పాటల సంకలనాలు చాలా వస్తున్నాయి. ఔత్సాహిక 'పాటకారులు' వీటిని చదువుతున్నారు. పాటలు నేర్చుకొని పోటీలలోను, వేదికలమీదా పాడుకొంటున్నారు. ఎక్కడో ఒకటీ అరా తప్పించి, సినీ కవి రాసిన పాటలన్నింటినీ ఎప్పటికప్పడు కాపీ చేసి పెట్టుకోవడం నేను ఎరగను. కాని ఈ రోజులు వేరు. ఇండియన్ పెర్ ఫార్మింగ్ రైట్స్ సొసైటీ (I.P.R.S) ఏర్పాటు అయ్యాక్త సినీకవులు గాయకులు సంగీత దర్శకులు తమ పాటల వివరాలను సేకరించుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ఎంతో కష్టమైన పని అని ప్రారంభించేదాకా తెలియదు. I.P.R.S లో తమ తమ పాటల పూర్తి వివరాలను నమోదు చేసుకోలేని కవులూ సంగీత దర్శకులూ చాలా మంది ఉన్నారని వారి కార్యాలయం తెలిపిన భోగట్టా. పూర్వం సినిమా థియేటర్ల దగ్గిర పంపిణీదారులు ప్రచురించి అమ్మిన పుస్తకాల్లో కథ పాటలు ఇతర వివరాలు వుండేవి. చాలా కాలమై ఇవి కనుమరుగయ్యాయి. ఈ పుస్తకాలు సేకరించి వాటిని సినిమా పాటల పరిశోధనా కేంద్రాలుగా రూపొందించి కొందరు సేకరణ కర్తలు వీటి గిరాకీని గుర్తించారు. కవులకే వారి పాటలను వేలాది రూపాయిలకి అమ్ముతున్నారు. డబ్బున్న కవులు వేలు గుమ్మరించి తమ పాటలు కొనుక్కొని సంకలనాలు వేసుకుంటున్నారు. వేయించుకొంటున్నారు. పాటలని I.P.R.Sలో ఎందుకు నమోదు చేసుకోవాలి? ఈ విషయం అసలీ