
ARUDRA RACHANALU KUNALAMMA PADALU
by ARUDRA
₹120
In stock · 6 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'సాహిత్యం అర్ణవమైతే - ఆరుద్ర మథించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే - ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు.' అందరూ మామూలుగా రాసేవి పద్యాలు ఆరుద్రగారు మాత్రమే రాస్తారు పజ్యాలు ప్రతి పదంలోను, ప్రతిపద్యంలోను కూడా కనబడుతుంది వీటికీ, మిగిలినవాటికీ తేడా కేవలం భావకవి యెంత మాత్రం కాదు వీరు అక్షరాలా త్వమేవాహం భావ కవి ఆరుద్రగారు అందుకే సంసార సాగరంలోంచి తీస్తారు సారం ఆరుద్ర సాహిత్యకారులు, అభ్యుదయ కవి, విమర్శకులు, నాటక, సినీగేయ రచయితగా ప్రసిద్ధి గాంచిన వీరు 31 ఆగస్టు, 1925న విశాఖలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న జాతీయవాది. 'ఆనందవాణి' పత్రిక సంపాదకునిగా వ్యవహరించారు. 'త్వమేవాహం'తో వచన కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేశారు. 1949లో చలనచిత్ర రంగంలో ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పరిశోధన చేసిన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' 1966లో సంపుటాలుగా వెలువడి సాహిత్యలోకంలో 'ఆరుద్ర'కు చిరస్మరణీయమైన స్థానం కల్పించాయి. విమర్శకు 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. (1960), ລໍ (1949). ໖໖ గేయాలు, (1965), వెన్నెల - వేసవి, వేమన్నవేదం (1974), ప్రజాకళలూ ప్రగతివాదులు, ఆరుద్ర సినీగీతాలు (1-5 సంపుటాలు), రాముడికి సీత ఏమౌతుంది?, గుడిలో సెక్స్, కాటమరాజు కథ, అరబ్బీ మురబ్బాలు, హస్త లక్షణ పదాలు, పలకల వెండిగ్లాసు ,పైలా పచ్చీసు, ఆరుద్ర కథలు, మహనీయుల కలం చిత్రాలు లాంటి రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వీటిలో కొన్ని విశాలాంధ్ర ప్రచురణలుగా వెలువడ్డాయి. 1955లో విషప్రయోగం, దేవుని ఎదుట, న్యాయాధికారి, పార్కు బెంచీ, నన్ను గురించే, దరఖాస్తు ఫారం, అక్కయ్యకి ప్రమోషన్ మొదలైనవి ఆరుద్ర నాటికలుగా వెలువడ్డాయి. వీరు 4 జూన్ 1998న మద్రాసులో తుదిశ్వాస విడిచారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ VPH01101822