ARUDRA TWAMEVAHAM by DR.ARUDRA Telugu book cover

ARUDRA TWAMEVAHAM

by DR.ARUDRA

₹150
In stock · 17 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆరుద్ర సాహిత్యకారులు, అభ్యుదయ కవి, విమర్శకులు, నాటక, సినీగేయ రచయితగా ప్రసిద్ధి గాంచిన వీరు 31 ఆగస్టు, 1925న విశాఖలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న జాతీయ వాది. 'ఆనందవాణి' పత్రిక సంపాదకునిగా వ్యవహరించారు. 'త్వమేవాహం'తో వచన కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేశారు. 1949లో చలనచిత్ర రంగంలో ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పరిశోధన చేసిన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' 1966లో సంపుటాలుగా వెలువడి సాహిత్యలోకంలో 'ఆరుద్ర'కు చిరస్మరణీయమైన స్థానం కల్పించాయి. విమర్శకు 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. (1949). ໖໖ (1960), గాయాలు - గేయాలు, (1965), వెన్నెలు- వేసవి, వేమన్నవేదం (1974), ప్రజాకళలూ ప్రగతివాదులు, ఆరుద్ర సినీగీతాలు (1-5 సంపుటాలు), రాముడికి సీత ఏమౌతుంది? గుడిలో సెక్స్, కాటమరాజు కథ, అరబ్బీ మురబ్బాలు, హస్త లక్షణ పదాలు, పలకల వెండిగ్లాసు, పైలా పచ్చీసు, ఆరుద్ర కథలు, మహనీయుల కలం చిత్రాలు లాంటి రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వీటిలో కొన్ని మా ప్రచురణలుగా వెలువడ్డాయి. 1955లో విషప్రయోగం, దేవుని ఎదుట, న్యాయాధికారి, పార్కు బెంచీ, నన్ను గురించే, దరఖాస్తు ఫారం, అక్కయ్యకి ప్రమోషన్ మొదలైనవి ఆరుద్ర నాటికలుగా వెలువడ్డాయి. వీరు 4 జూన్ 1998న మద్రాసులో తుదిశ్వాస విడిచారు. కావ్య చరిత్ర “త్వమేZవాహం" రచన 1948 జులైలో. 1949లో "తెలుగు స్వతంత్ర"లో తొలిసారిగా "త్వమేవాహం వేదనా శకలం - తథాస్తు”లు ప్రచురితమైనాయి. పుస్తక రూపంలో 1949 జూలైలో "కళాకేళి ప్రచురణలు-సామర్లకోట"వారు ప్రకటించారు. 1962 సెప్టెంబరులో చందా నారాయణ శెట్టి- సికింద్రాబాద్ వారు ద్వితీయ ముద్రణ ప్రచురించారు. అప్పుడు దీనిలో 1955లో వ్రాసిన “కాలం" అనేపద్యాన్ని "ఆవాహన" అని పేరు మార్చడం සට්ñරයි. అంతేగాక టీకా టిప్పణి తాత్పర్య వ్యాఖ్యానాలు చేర్చడం కూడా జరిగింది. నాల్గవ ముద్రణలో హరీంద్రనాథ చటోపాధ్యాయ రచించిన "వీరతెలంగాణా" గీతానికి సాగర సంగమం" శీర్షికతో ఆరుద్ర చేసిన ఆంధ్రానువాదాన్ని చేర్చటం జరిగింది. ఐదవ ముద్రణలో డా.సి.నారాయణరెడ్డి “విశ్లేషణ” చేర్చడం జరిగింది.