
ARUN SAGAR MUSIC DIES - ANU OKA MARANA VANGMULAMU
by ARUN SAGAR
₹70
In stock · 1 available
PublisherSAHITHI MITRULU
LanguageTelugu
MUSIC DIES An Anthology of Poems BY ARUN SAGAR VOICES OF DISPLACED అమెరికాలో ఎవడో ఒకడు 'ఎం టీవీ' పెట్టుబడికి ముందు అమెరికా సంగీతం ఎలావుందో అని తెలుసుకోవడానికి 'బిఫోర్ ద మ్యూసిక్ డైస్' అనే పరిశోధన మొదలు పెట్టినట్టు అరుణ్సాగర్ ఇప్పుడు 'మ్యూజిక్ డైస్' పేరుతో ముందస్తు హెచ్చరిక చేస్తున్నాడు. రాష్ట్ర పునర్విభజన చట్టం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు వరప్రదాయినిగా మారిపోయిన పోలవరం నేపథ్యంలో ఆయన నిర్వాసితులవుతోన్న తన లక్షలాది ఆదివాసుల ఆఖరి వాక్యంగా వినిపిస్తున్నాడు. ఘంటా చక్రపాణి రామయతండ్రీ నీ అరణ్యాన్ని ఆవాసాన్ని ఆవరణాన్ని లేడి పిల్లల్నీ అడవి బిడ్డల్నీ నీ పాదాలు ముద్దాడే పాపికొండల్నీ రేపోమాపో రెవెన్యూ రికార్డుల నుంచి తొలగిస్తారు రామా ఇలా రా నా పక్కన కూర్చో నాతో కలిసి ఈ మట్టి మరణవాంగ్మూలం విను దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు విను వినరా విను! సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు ఫెట ఫెటేల్ ధ్వానాల్ విను! వినరా విను!