ARUNA - CHALAM SAHITYAM NAVALALU by CHALAM Telugu book cover

ARUNA - CHALAM SAHITYAM NAVALALU

by CHALAM

₹110
In stock · 163 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
చలం “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ “ఆమె ప్రవేశం, నిర్గమణ మరొలోకానికి చెందినవా అనిపిస్తాయి. ఈ నవలను ప్రతీకాత్మకంగా అర్థం చేసుకోవాలి. సౌందర్యారాధక శక్తికి శృంగార చైతన్యానికి ప్రతీక ‘అరుణ’, భర్త కుటుంబ వ్యవస్థకు ప్రతినిధి. ప్రియుడు ముగ్గురు మనిషిలో భిన్న అంతర్వాహకులకు చిహ్నాలు. స్త్రీకి పరమ స్వేచ్ఛ లభించినప్పుడే ఆమెలోని శృంగార చైతన్యం సంపూర్ణంగా వికసిస్తుంది. అప్పుడే పురుషుడు స్త్రీ నుండి సంపూర్ణానందాన్ని చవిచూడగలడు. కానీ అట్టి పరిపూర్ణతని భరించగల పరిపక్వ పురుషుడు లేడు. చివరకు హృదయమాది పరమ ప్రియుడు అయిన రుక్మిణి గూడె. కనుక ఆ సంపూర్ణ స్త్రీత్వం లోకానికి అందకుండానే పోతుంది. ఇది ఈ నవల అంతటా వినిపించే ధ్వని.”