ARUNA NETRAALU by SONTI JAYAPRAKASH Telugu book cover

ARUNA NETRAALU

by SONTI JAYAPRAKASH

₹150
In stock · 6 available
PublisherBHARANI PUBLICATIONS
LanguageTelugu
రచయిత మాట ప్రియమైన పాఠకులకు నమస్కారం ఇది నేను వెలువరిస్తున్న మూడో అనువాద ప్రపంచ వివిధ భాషల అనుసృజన కథల సంపుటి. ఇందులో తొమ్మిది థ్రిల్లర్ కథలున్నాయి. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ ఉటంకించిన రెండు వాక్యాలు స్ఫురణకు వస్తున్నవి. వాటినిక్కడ పొందుపరచడం సముచితమని నా అభిప్రాయం. "ఇంగ్లీషు ఒక ద్వారం. దీని ద్వారా నాకు ప్రపంచంలోని ఎన్నో భాషల కవిత్వపు భవనాలలోకి ప్రవేశం లభించింది. మన తెలుగు కవులంతా అనువాదాలలో అందె వేసిన చేతులే కదా!" పై వాక్యాలు తన “అనంతం" పుస్తకంలోని 'అద్దంలో శ్రీశ్రీ' అనే శీర్షికలో వ్రాశారు. ఆ ప్రేరణతో - నేను కూడా పలు ఇంగ్లీషు పుస్తకాలు చదవడం ద్వారా ఇతర దేశాల ప్రజల ఆర్థిక సంస్కృతి సంప్రదాయాల్ని, జీవన శైలితో కొంతవరకూ పరిచయం ఏర్పడింది. వాటిని పాఠకులతో పంచుకోవాలనే సదాశయమే అనువాద కథల సంపుటులను పుస్తకరూపంలో తీసురావడానికి కారణమైంది. ప్రస్తుత “అరుణ నేత్రాలు" అనే సంపుటిలోని కథలన్నీ సాక్షి ఫండే, విపుల, ప్రజాశక్తి మొదలగు పత్రికలలో ప్రచురణకు నోచుకొన్నవే. ఇందుకుసంబంధించిన మూల కథలు దాదాపు వందేళ్ళ క్రితం వివిధ గొప్ప రచయితలచే లిఖించబడ్డవి. రచయితలు కూడా ఎప్పుడో కాలధర్మం చెందారు. వారిని ఒక మారు స్ఫురణకు తెచ్చుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నమిది. పాఠకులు సహృదయంతో ఈ చిన్న పుస్తకాన్ని ఆదరిస్తారని వినయ పూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.