
ARUNDATHI @ 70
₹150
In stock · 57 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
ఒక ప్రేమ కథ ໖ 1974. "మన ఉమకి ఆ అబ్బాయి భార్గవ చక్కగా సరిపోతాడు కదండీ” భర్తకి అన్నం వడ్డిస్తూ అడిగింది రాజేశ్వరి. "అవుననుకో ఈడూ జోడూ సరిగ్గా సరిపోతుంది, కానీ..." "ఇంక కానీ, అణా ఏమిటండీ! కర్నూలు వెళ్లి మాట్లాడేద్దాం. మా తమ్ముడితో కూడా ఓ మాట చెప్తాను. వాడి తోడల్లుడి కొడుకే కదా, వాడూ చెప్పి చూస్తాడు మన ఉమ గురించి వాడికి మాత్రం బాధ్యత వుండక్కర్లా?" “అదంతా సరే రాజీ! నా వుద్దేశ్యం యేమిటంటే, అబ్బాయి ఎమ్.బి.బి.ఎస్. చదువుతున్నాడు కదా, పెళ్లి విషయంలో వేరే ఐడియాలేమైనా వుండొచ్చేమోనని...” "మీరెప్పుడూ యింతే! శుభం పలకరా పెళ్లికొడుకా అంటే, ఏదో అన్నాట్ట. అలా వుంది వరస. అసలు అడగందే యెలా తెలుస్తుందండీ! ఈ పిల్ల మనతోపాటు పెళ్లికి వొచ్చుంటే బాగుండేది. అబ్బాయి కంట పడేది. పరీక్షలంటూ కూచుంది. పోనీ మనమైనా వెళ్లి అడుగుదామంటే...”