
ASALU MAHATMUDU
by M.V.R.SASTRY
₹150
In stock · 4 available
PublisherDURGA PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట ఇది ఒక ధర్మవీరుడి కథ. ఇంతకు ముందు కొన్ని రచనల్లాగే ఇది కూడా అనుకోకుండా రాసిన పుస్తకం. 'చౌరీ చౌరా'లో ఆగిన 'మన మహాత్ముడు'కు కొనసాగింపుగా అల్లూరి నుంచి నేతాజీదాకా జాతీయోద్యమాన్ని సింహావలోకన చేద్దామని ఉపక్రమిస్తే సీతారామరాజే ఒక పుస్తకమయ్యాడు. తరువాయి చరిత్ర ఎప్పుడు అని చదువరులు తొందర పెట్టగా శ్రద్ధానందతో శ్రీకారం చుట్టాను. రెండు మూడు అధ్యాయాల్లో ముగించి, తదుపరి అంకం అందుకుందామనుకుంటే అయ్యే పనిగా తోచలేదు. ఇంటర్నెట్లో దొరికిన కొద్దిపాటి సమాచారం సారంతీసి, అనేక ఇతర గ్రంథాల్లో అరకొరగా దొరికిన పాయింట్లను దగ్గర చేర్చి, జాతీయ దృక్కోణం నుంచి అవలోకిస్తే ఒక అపురూప ధర్మశక్తి పొడగట్టింది. దానికి అక్షర రూపమే మీ చేతుల్లోని ఈ పుస్తకం. మన దేశాన్ని పీడిస్తున్న శాపాల్లో బౌద్ధికమైన బద్ధకం ఒకటి. స్వాతంత్ర్య మనబడేది వచ్చి జాతి కుటిల రాజకీయ కపటుల పాలపడ్డాక మేధావుల మెదళ్లు మొద్దుబారిపోయాయి. జిజ్ఞాస, పరిశోధన, పునర్ మూల్యాంకనం, సత్యాన్వేషణ లాంటివి. మిగతా రంగాల్లాగే చరిత్ర విషయంలోనూ అడుగంటాయి. కొసరు విషయాలు అతి ప్రధానమై, అసలు సంగతులు మరపున పడ్డాయి. ఒకానొక పాలక వంశాన్ని, దాని పాలకీ మో మోసిన లేక అండగా నిలిచిన ఆషాఢ భూతులను ఆకాశానికెత్తే విధంగా... వాటిని ఎదిరించి, జాతిహితంకోసం పోరాడిన దేశభక్తులను, విప్లవశక్తులను పాతాళానికి తొక్కటమే పనిగా... జాతీయోద్యమ చరిత్రకు వెల్లవేతలు, తిరగరాతలు, తిరగమోతలు పకడ్బందీ పథకం ప్రకారం సాగాయి. పర్యవసానంగా ఒకప్పుడు జాతీయ జీవనంలో, సామాజిక, రాజకీయ రంగాల్లో కీలక భూమిక వహించిన ఎందరో మహామహులు తలిచేవారు లేక, ఆనవాళ్లు మిగలక విస్మృతి పాలయ్యారు. లేదా ఆస్థాన చరిత్రకారుల చేతుల్లో దారుణ వక్రీకరణలకు గురయ్యారు. మరపున పడ్డ అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు స్వామి శ్రద్ధానంద.