ASAMANA ANASUUYA by DR.AVASARALA ANASUYA DEVI Telugu book cover

ASAMANA ANASUUYA

by DR.AVASARALA ANASUYA DEVI

₹250
In stock · 10 available
PublisherVANGURI FOUNDATION OF AMERICA
LanguageTelugu
ముందు మాట మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గెంతులేసి ఆనందిస్తున్నాం అనుకోడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుంచీ ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. మేనమామ దేవులపల్లివారి 'జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి', కొనకళ్ళవారి 'మొక్కజొన్న తోటలో', 'నోమీన మల్లాల', అప్పటికి అముద్రితాలైన నండూరివారి ఎంకి పాటలు, గురజాడవారి ముత్యాల సరాలు, శ్రీశ్రీగారి మహాప్రస్థానం, రాయప్రోలువారి దేశభక్తి గీతాలు... ఒకటేమిటి కొన్ని వేల పాటలకి తొలిసారిగా స్వరాలు కట్టి తన అసమాన స్వరంతో శాస్త్రీయ సంగీత స్థాయిలో పూర్తి కచేరీలు చేసిన తొలి తెలుగు గాయని అసమాన అనసూయ గారే! తెలుగు సంగీత చరిత్రలో ఇప్పుడు లలిత సంగీతం అని పిలవబడుతున్న భావగీతాలకి ఆద్యురాలై, బ్రిటిష్వారి రోజులలోనే దేశభక్తి గీతాలని నిర్భయంగా పాడి, అంతవరకూ 'కామెడీ పాటలు' అని పిలవబడుతున్న పాటలకి జానపద గేయాలుగా ప్రచారం చేసి, సభా గౌరవం కలిగించిన తొలి గాయని అసమాన గాయని అనసూయాదేవిగారే! అంతెందుకు, ఈనాడు తెలుగునాట ఏ సినిమాలో కానీ, పాటల కార్యక్రమాలలో కానీ ఎటువంటి జానపద బాణీ వినిపించినా, దాని మూలాలు అనసూయాదేవిగారు దశాబ్దాల పాటు మారుమూల ప్రాంతాలు తిరిగి సేకరించి, బాణీ కట్టి పాడినదే అని నిస్సందేహగా చెప్పవచ్చును. అంతకు ముందు నేను ఆవిడ వేదికల మీద పాడడం విన్నా, వ్యక్తిగత పరిచయం మటుకు 1977లోనే. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆవిడ నన్ను పుత్ర సమానుడిగానే అభిమానంతో ఆదరించారు. 1977లో నేనూ, ఆవిడ పెద్దల్లుడు అనిల్ కుమార్ (సుప్రసిద్ధ నర్తకి రత్నపాప భర్త) కలిసి అమెరికాలో అనసూయ-సీత 'మన పల్లెపదాలు' అనే తొలి తెలుగు గ్రామఫోన్ రికార్డు ప్రొడ్యూస్ చేశాం. అమెరికాలో ఆవిడ కచేరీలు అనేకం ఏర్పాటుచేసే అదృష్టం కూడా నాకు కలిగింది. 1980లో మా తమ్ముడు హనుమంతరావు పెళ్ళికి ప్రత్యేకం కాకినాడ