ASAMARTHURALI ANTHARANGAM by RAJANI SUBRAMANYAM Telugu book cover

ASAMARTHURALI ANTHARANGAM

by RAJANI SUBRAMANYAM

₹150
In stock · 55 available
PublisherJ.V.PUBLICATIONS
LanguageTelugu
అసమర్ధురాలి అంతరంగం Rajani has a way of weaving stories out of mundane hap-penings in her life, incidents most people would not consider important. It is her ability to empathize with others, and translate those emotions into words, that helps her with her storytell-ing. Her humor, her high sense of morals, her childish energy and her warmth take her writing to new dimen-sions, which is visible throughout the book. -Shilpesh Katragadda, Son మా నాన్నగారు శ్రీ గోపీచంద్ నవల 'అసమర్ధుని జీవయాత్ర' పట్ల నాకున్న మక్కువతో నా కథల పుస్తకానికి 'అసమర్ధురాలి అంతరంగం' అని పేరు పెట్టడం జరిగిందనీ నమ్రతగా విన్నవిస్తున్నాను. అంతేగానీ శ్రీ గోపీచంద్ తాత్విక దృష్టి, ఆర్ద్రత, మనోవిశ్లేషణ, పారదర్శకత నేను అందుకోలేను. తాతగారు త్రిపురనేని రామస్వామిగారి విప్లవ కవిత్వం తెలుగు బావుటాని ఎగరవేసిందని గర్వపడిపోతుంటాను. కనబడేది భ్రమ అని అసలు సత్యం వేరే ఉందనే శ్రీ గోపీచంద్ మాటలు నన్ను ఆలోచింపజేస్తాయి. నాలో నేను చూసుకొంటే తాతతండ్రులు జిజ్ఞాస, ఆలోచన, మానవతా విలువలు, ధనదృష్టి లేకపోవటం నాలోనూ ప్రగాఢంగా కాకపోయినా, నిగూఢంగా వున్నాయి. వారిరువురిలా చదువుకొన్నానని పొంగిపోతుంటాను. మా అమ్మ శకుంతలాదేవి కూడా విద్యావేత్తే మరి. రామస్వామిగారి సూతాశ్రమంలో పుట్టాను. మద్రాసు, కర్నూలు, హైదరాబాదులో పెరిగాను. ఇరవై ఏళ్లకే M.A సోషయాలజీ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేసి బెంగళూరుకు వెళ్ళిపోయాను. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ పిల్లలకే ప్రాధాన్యత ఇచ్చాను. మాబోజల్ ఏడ్ కంపెనీకి ఇంగ్లీషునించి తెలుగు తర్జుమాలు చేసాను. ఐదు సంవత్సరాలు స్పార్టెక్ టైల్స్ కంపెనీ బిజినెస్ `చేసాను. మూడు షార్ట్ ఫిల్మ్స్ లో నటించాను. అందులో వారణాసి లాస్ఏంజిలిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫారిన్ ఫిలిమ్ అవార్డు అందుకుంది. నాకు కథలు, కళలు ప్రాణం. నా కోసం నేను చేసుకున్నది మాత్రం ఈ పుస్తక ప్రచురణ. గోపీ తోకచుక్క సినిమా మాటలకు సహ రచయిత్రిని. - రజనీ సుబ్రహ్మణ్యం