ASAMMATHI PATRAM by GURAJADA APPARAO Telugu book cover

ASAMMATHI PATRAM

by GURAJADA APPARAO

₹120
In stock · 1 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ASAMMATHI PATRAM by Gurazada Apparao “వారి (తెలుగు కవుల) కవితలు మేము మొదట చదివినప్పుడు, వాటిలో ఉపయోగించిన భాష అనునిత్యమూ మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పూర్తిగా భిన్నమైనదని అనుకోవలసి వచ్చింది." - సి.పి. బ్రౌన్ "చిన్నయసూరికి ముందు ఆంధ్రసారస్వతంలో వచన రచన లేదనుకోవడం పొరపాటు, వందలకొలది గ్రంథాలు వచనంలో వున్నవి కనబడినవి. అవి అన్నీ వాడుకభాషలో వున్నవి." - గిడుగు రామమూర్తి “తమిళం నేర్చుకోవాలనుకొన్న విదేశీయుణ్ణయిన నాకు, ఉపాధ్యాయుడు నేర్పిన తమిళం వీధుల్లో ఎన్నడూ వినిపించలేదు. నేను సర్కారు జిల్లాలకు వచ్చినప్పుడు, తెలుగు సాహిత్యానికి, వాడుకలో వున్న తెలుగు భాషకు సంబంధం ఏమీ లేకపోవడం గమనించాను." జె.ఎ. ఏట్స్ "నన్నయనాటి తెలుగుభాషే నేటికిన్ని ఏ మార్పు లేకుండా ఉన్నదనడం అబద్ధం. ఉండాలనుకోవడం అవివేకం. నన్నయనాటి గోదావరే ఈనాడూ ప్రవహిస్తుంది. కాని ఆనాటి జలం ఈనాటిది కాదు." - గిడుగు సీతాపతి "తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమా, లేక దానికి స్వేచ్ఛ, జవసత్వాలనిచ్చి, దాన్ని ఒక గొప్ప నాగరికతా శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడివుంది." గురజాడ అప్పారావు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004