
ASHOKUDU - MOURYAVAMSA KSHENATHA - 250
₹250
In stock · 549 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ASHOKA AND THE DECLINE OF THE MAURYAS Dr. Romilla Thapar, Translated by: Dr. B.S.L. Hanumantharao 'అశోకుడు - మౌర్యవంశ క్షీణత' గ్రంథాన్ని డా॥ రోమిల్లా థాపర్ రచించారు. వీరు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్రశాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో వీరు ప్రథమశ్రేణిలో ఉన్నారు. జె.ఎన్.యు.లో ఎమిరిటస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. క్రీ.పూ. 3,4 శతాబ్దాలనాటి మౌర్యుల నాగరికత నేపథ్యాన్ని, దాని సమగ్రచరిత్రను ఈ గ్రంథం విశ్లేషిస్తుంది. అశోకుని శిలాశాసనాలు, మౌర్యుల నాణేలు, వాఙ్మయాధారాలు, భౌతికావశేషాల ఆధారంగా ఆనాటి చరిత్రను వివరించింది. బౌద్ధమత ప్రభావంవల్ల అశోకుని పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, పాలనాపరంగా ఏఏ మార్పులు జరిగాయో ఈ గ్రంథం విశ్లేషించింది. ప్రాచీన భారతదేశం తదనంతర పరిణామాలకు గల సంబంధాలను ఈ గ్రంథం కొత్త కోణంలో వ్యాఖ్యానించింది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004