ATHMAKATHA CHALAM by CHALAM Telugu book cover

ATHMAKATHA CHALAM

by CHALAM

₹260
In stock · 89 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199530591
చలం ఆత్మకథ సార్థకమైన “ఆత్మ”కథ స్వీయ చరిత్రలన్నీ ఆత్మకథలుకావు. తారీఖుల వివరాలతో సహా బోరుకొట్టే విషయాలు. చరిత్రకు పనికి వచ్చేవి సమాచారంతో ఉండేది స్వీయచరిత్రలు – ఇందులో ఆవేశమీలేవు. ఆత్మకథ అనగానే “ఆత్మ” ప్రత్యక్షంగా ముందుకు వస్తుంది. ఆ భావానికి భారతీయ చింతనలో ప్రత్యక్షకారం ఉంది. దేహం ఎప్పటికీ ముందు, దేహం విడిచిన తర్వాతగూడా దాని అస్తిత్వాన్ని గుర్తించి రాసేదే “ఆత్మకథ”. “ఓ పువ్వు పూసింది” కథ ముగింపులో “చలం” వ్యక్తిత్వం సూచనగా ఉంది. “ప్రేమతో అనుభవమొందు అని చెప్పింది – ఆకాశంలో తేలుతూ భక్తితో అతని ముఖమంతా చూచి భక్తురాలైన నవ్వింది ఆనందాన్ని ఆచూకోలేక” – ఎక్కడికి ఎగిరితే వ్యక్తిత్వంతో తాను పువ్వు అయి చెప్పుకున్నాడు. అది దాదాపు 30 ఏళ్ల క్రితం తాను ఎక్కడ నుంచి వచ్చాడో వెతుక్కొని ఈ పుస్తకంలో “అవతరణ”లో అస్తిత్వాన్ని వివరించి చెప్పాడు. ఇలా “ఆత్మ”ను తను చరిత్రలో భాగం చేసుకున్న స్వీయచరిత్ర రచయితలెవరూ లేరు. అందుకనే “చలం”ను మాత్రమే “ఆత్మకథ” అనడం సార్థకం. అతని రచనల మద్య జరిగిన విశేషాల కథ ఇది. తన జీవిత సంస్కారం, జీవిత రూపంతో ఎల్లా పక్వంచెందుతూ ఒడిదుడుకుల మధ్యయాలలో సాగిన మార్గమే చెప్పిన చలం ప్రయాణ కథ ఇది. బాలబంధు బి.వి. నరసింహారావుగారు చలంగారితో అన్నట్లు ఈ పుస్తకంలో అసలు ఆయన “డెబిట్స్” కానీ “క్రెడిట్స్” చెప్పుకోలేదు – డెబిట్స్‌కు కూడా తారీఖులు కావాలా? — వాడ్రేవు సుబ్బారావు