
ATTADA APPALNAIDU SAHITYAM - VOL 1 2 3 VOLUMES
₹600
In stock · 45 available
PublisherATTADA APPALANAIDU
LanguageTelugu
ఇవి సహృదయ పాఠకులకు వెలుతురు మరకలు.. భుజాలు తడుముకునే వారికి.. చుట్టకాల్చి పెట్టిన చురకలు.. భావుకుల హృదయాలపై జలజల రాలే పూల రేకులు.. మాయగాళ్ళంటారే... అలాంటి వాళ్ళ గుండెలకు గుచ్చుకునే పూతికమేకులు.. కొండొకచో చీల్చే బాకులూ కావొచ్చు.. ఔను.. ఇవి ఊసులే ... నేస్తం ఊసులు ఓపిగ్గా అల్లిన వాక్యాల ఊలుదారాల లేసులు.. పలకరించి చేతికిచ్చిన పిన్నీసులు.. ఉపయోగించుకునేదెలాగో నిర్ణయం మనదే. సున్నితమైన హాస్యం ... చురుక్కుమనే వ్యంగ్యం.. ఫేడీల్ మని తగిలే వెటకారం.. కొంచెం కారం, కొంచెం మమకారం, కొంత వగరు, కొంత పొగరు.. ఇన్నిన్ని కలిపి నడిపిన వ్యవహారం.. యీ నేస్తం ఊసులు. దిగి చూస్తే లోతు... తిని చూస్తే రుచి.. తెలుస్తాయి కదా... ఊసులు కదా అని ఊసుపోక చెప్పినవనుకునేరు. పలు విషయాల రాశులు, రోజువారీ వార్తల మీద తీసిన క్లాసులు. మూడేళ్ళపాటు ప్రతివారం క్రమం తప్పకుండా సూర్య దినపత్రికలో పేల్చిన సీమటపాసులు. గంటేడ గౌరునాయుడు శ్రీకాకుళ సాహితి మిత్ర సాహితి స్నేహ కళా సాహితి