
ATTAGARI KATHALU
₹300
In stock · 100 available
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ISBN9788195329830
అత్తగారి కథలు (ప్రథమ భాగం] అత్తగారూ - ఆవకాయా సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర్నుండి విశాఖపట్నం వరకూ వుండే వూళ్ళల్లో బంధువులో, తెలిసినవాళ్ళో వుండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులూ, తెలిసినవాళ్ళూ, కనీసం ఆవకాయ సప్లయి చేసే రకం బంధువులు- ఇద్దరూ లేని తెలుగువాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందేకాని ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగార్లు వుండే కుటుంబాలకు బాధేలేదు. నూజివీడు రసాల కాయలూ, సామర్లకోట పప్పునూనే తెప్పించలేకపోయినా మద్రాసు మామిడి కాయలతోనైనా ఘమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చీ తింటం తెలిసి, ఆవకాయ పెట్టడం తెలియని మాబోటివాండ్లకే అవస్థ........