
ATYANTHA SULABHA PADDHATULLO ENGLISH GRAMMAR NERCHUKONDI
by V.G.BHAVANI
₹65
In stock · 5 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
ముందుమాట ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత నానాటికీ ప్రపంచ దేశాలన్నింటిలో బాగా పెరిగిపోతోంది. అందుకు కారణం- ముఖ్యంగా విద్యావిధానాలలో ఎన్నో గణనీయమైన మార్పులు రావడం. ఏ రంగానికి సంబంధించిన అంశమైనా చర్చించాలన్నా, బోధించాలన్నా - అది అందరికీ అర్ధం కావాలంటే ఇంగ్లీష్ లోనే సాధ్యం అవుతుంది. ఇంగ్లీష్ భాష చాలా కష్టం, అదొక మహాసముద్రం వంటిదని చాలామంది -అపోహపడుతుంటారు. బాగా అర్థం చేసుకోగలిగితే - ఇంగ్లీష్ అంత సులువైన భాష మరొకటిలేదు. ఇంగ్లీష్ అక్షరాలు కేవలం ఇరవై ఆరు మాత్రమే. భాషకు అవసరమైన వ్యాకరణ సూత్రాలు భాషాభాగాలు చాలా క్లుప్తంగా భాషను వివరించేవి. వాటిని సునిశితంగా సాధనచేస్తే - ఇంగ్లీష్ భాషను ఎవరైనా నేర్చుకోవచ్చును. అయితే... నేర్చుకునే విషయంలో అందరికీ దాని మీద కొంత అవగాహన వుండాలి. "మా పోస్టల్ కోర్స్ ద్వారా మీరు ఇంగ్లీష్ వెంటనే మాట్లాడేస్తారు-ఇరవై నాలుగ్గంటల్లో ఇంగ్లీష్ నేర్పించేస్తాం" అనే ప్రకటనలు చాలా మందిలో ఆశలు రేపుతూ, వాళ్ళ ఆశలను అడియాశలను చేస్తున్నాయి. అటువంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన విధానాలలో గ్రామర్ తో సహా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే అది సరైన మార్గదర్శకమవుతుంది. ఏ భాషలోనైనా గ్రామర్లేకుండా ఒక్క వాక్యం మాట్లాడలేము - ఒక్క విషయం వ్రాయలేము. కాబట్టి - ఏ భాషకైనా వ్యాకరణ విశేషాల్ని తెలుసుకోవాలి. ఈ పుస్తకంలో - ఇంగ్లీషు భాషా భాగాలను పూర్తిగా వివరిస్తూ- మనం నిత్యజీవితంలో మాట్లాడటానికి గానీ, వ్రాయడానికి గానీ, ఉపయోగించే వ్యాకరణాన్ని చేర్చి వివరించడం జరిగింది. శ్రద్ధతో సాధన చేయగలరు. - పబ్లిషర్స్