AVAYAVALA ATHMA KATHALU - 60.00 by DR.PARUCHURI RAJARAM Telugu book cover

AVAYAVALA ATHMA KATHALU - 60.00

by DR.PARUCHURI RAJARAM

₹60
In stock · 913 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఎన్ని గుండెలు నీకు !! ఆశ్చర్యపోతున్నారా? నేనెవర్నేని? నేనే! మీ గుండెను మాట్లాడు తున్నాను! ఎన్నాళ్ళనుంచో మీతో నాగోడు చెపుదామనుకుంటున్నాను. ఎక్కడ, మీరు వింటేగా, పొద్దున, వాడెవడో మీతో మాట్లాడుతూ "ఎన్ని గుండెలు నీకు, నన్ను కాదనడానికి!" అన్నాడు కదూ? నాకు నవ్వొచ్చింది వాడి అజ్ఞానానికి, మీకేకాదు, ఏ మనిషికయినా వుండేది ఒక్క గుండే. ఊపిరితిత్తుల్ని కూడా గుండె కింద లెక్కపెట్టాడేమిటి ఆ పెద్దమనిషి? ఎందుకైనా మంచిది, నా వివరాలు చెప్తాను వినండి. నేనేమీ సౌందర్యరాశిని కాను. కాగాపోగా మీరు తరచు నాకు ప్రతీకగా వేసే ఆఠీను గుర్తు అంత అందంగా కూడా వుండను. నా రంగు ఎరుపూ, కాఫీ రంగు కలిపినట్లుగా వుంటుంది. అందరి కంటే నమ్మకమైన బానిసను మీకు నేను! మీ కవి కుమారులు మృదుమధురంగా గానం చేసినట్లుండను నేను. 6" పొడవు; అత్యంత విశాలమైనచోట 4" వెడల్పు- నా బరువు పన్నెండు ఔన్సులు. నన్ను లిగమెంట్స్ అనేవి పట్టి వుంచుతాయి. మీ ఛాతిలో ఎడమపక్కన (అప్పుడప్పుడూ గుండెనొప్పి అని డాక్టరు దగ్గరకు వెళ్తారు. మీ డాక్టరు 'ఎక్కడ' అని అడిగితే కుడిపక్క చూపెడతారు కొందరు!) ఉంటాను. అయ్యా! నేను మీ కవులు గానంచేసినంత సున్నితమైనదాన్ని కాదు! అతి కష్టించి పనిచేసే ఒక పంపును నేను. (నీళ్ళపంపు కాదండోయ్) గట్టిగా మాట్లాడితే రెండు భాగాల పంపుని - మరీ నిలవేస్తే నాలుగు గదులున్న రెండు భాగాల పంపుని. ఇంత ఇదిగా